ఖమ్మం

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 25: గ్రామీణ ప్రాంతాలలో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని కలెక్టర్ రజత్‌కుమార్‌షైనీ ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నివారణ చర్యల గురించి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. దోమలను నివారించేందుకు ప్రతి కుటుంబానికి దోమతెరలు వినియోగించే విధంగా అవగాహన పెంచాలన్నారు. కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డెంగ్యూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, జ్వరం సోకిన వ్యక్తులు రక్తపరీక్షలు నిర్వహించి వచ్చిన నివేదికల ఆధారంగా వైద్యసేవలు అందించాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో డెంగ్యూ వ్యాధుల నిర్ధరణ చేసే పరీక్షలు నిరాధారమైనాయని అన్నారు. వైద్యసిబ్బంది టీంలుగా ఏర్పడి గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలన్నారు. వ్యాధులను నివారించేందుకు కార్యచరణ ప్రణాళికను తయారుచేయాలని ఆదేశించారు. వైద్యాధికారులు, ఎంపిడిఓలు సంయుక్తంగా గ్రామాలలో పర్యటించాలన్నారు. ప్రాధమిక వైద్య ఆరోగ్యకేంద్రాలను తనిఖీలు చేస్తామని, సమయ పాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. జ్వరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈసమావేశంలో జోనల్ మలేరియా అధికారి నాగయ్య, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి సింగరాజు, జిల్లాలోని వివిధ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలకు సంబంధించిన మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.