ఖమ్మం

గెలిచినా...ఓడినా ప్రజల పక్షానే్న ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, డిసెంబర్ 8: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా, ఓడినా ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు చేస్తూ అండగా ఉంటానని సిపిఐ(ఎం) పాలేరు నియోజకవర్గ అభ్యర్ధిని బత్తుల హైమావతి అన్నారు. శనివారం వరంగల్ క్రాస్‌రోడ్‌లోని తమ్మినేని సుబ్బయ్య భవన్‌లో సిద్ధినేని కోటయ్య అధ్యక్షతన జరిగిన సిపియం పాలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో డబ్బు, అధికార దుర్వినియోగం రాజ్యమేలిందని ఆరోపించారు. పార్టీ అధిష్టానం తనను అతి తక్కువ సమయంలో అభ్యర్ధిగా ప్రకటించినా నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా ఆదరించారని, వారిని జీవితాంతం గుర్తుంచుకుంటానని అన్నారు. ప్రచారం నిర్వహించిన ప్రతి గ్రామంలో ప్రజలు, మహిళలు, కళాకారులు, యువకులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలిపారన్నారు. ఈఎన్నికల్లో సహకరించిన ప్రజలందరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండి రమేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, అధికార దుర్వినియోగం వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లోనైనా డబ్బుకి, మద్యానికి అమ్ముడుపోకుండా పారదర్శకంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో సహకరించిన నియోజకవర్గ ప్రజలకు జిల్లా కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో నాయకులు బత్తుల లెనిన్, ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల కార్యదర్శులు నండ్ర ప్రసాద్, బారీ మల్సూర్, గుడవర్తి నాగేశ్వరరావు, అంగిరేకుల నర్సయ్య, నాయకులు బత్తినేని వెంకటేశ్వరరావు, తుమ్మల శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.