ఖమ్మం

అందరిలోనూ అదే ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 8: అసెంబ్లీ ఎన్నికలు పూరె్తైన నేపథ్యంలో పోటి చేసిన అభ్యర్థులు గెలుపుపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ అనుచరులు, బంధువులతో ప్రత్యేకంగా సర్వేలు చేయిస్తూ ఎవరికివారు తాము గెలుస్తున్నామనే ఉత్సాహంతో ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల పరిధిలోను వైరా నియోజకవర్గం మినహ మిగిలిన 9చోట్ల టిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేయడం విశేషం. మరోవైపు కూటమి అభ్యర్థులు లెక్కలు వేసుకుంటూ తాము గెలిచే స్థానాలను లెక్కిస్తూ ఓటింగ్ శాతం పెరగటమే తమకు కలసి వస్తుందని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల పరిధిలో 84.77శాతం పోలింగ్ నమోదు అయింది. ఓటర్లు ఉత్సాహంతో ఓటు వేసేందుకు రావడంతో కొన్నిచోట్ల అర్థరాత్రి వరకు పోలింగ్ నిర్వహించారు. మధిర నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 91.27శాతం పోలింగ్ నమోదు కాగా ఖమ్మం నియోజకవర్గంలో 73.98శాతం, పాలేరులో 90.97శాతం, వైరాలో 87.99శాతం, సత్తుపల్లిలో 88.34శాతం, కొత్తగూడెంలో 80.18శాతం, పినపాకలో 85శాతం, ఇల్లెందులో 82.14శాతం, అశ్వారావుపేటలో 87.81శాతం, భద్రాచలంలో 80శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లా మొత్తంమీద 86.51శాతం పోలింగ్ నమోదు కాగా కొత్తగూడెం జిల్లాలో 83.02శాతం పోలింగ్ నమోదైంది.
ఇదిలాఉండగా పోలింగ్ శాతం అధికంగా ఉండటంతో అభ్యర్థులు ఎవరికివారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బూత్‌ల వారిగా పోలైన ఓట్లను లెక్కిస్తూ తమకు ఎన్ని ఓట్లు పడ్డాయనే అంశాన్ని ఆరా తీస్తున్నారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందుకున్న వారు తమకు మద్దతుగా నిలిచారని, ప్రభుత్వ అనుకూల ఓటు అధికంగా ఉన్నదని అందుకే తమ గెలుపు సులభం అవుతుందని పేర్కొంటున్నారు. అయితే ప్రత్యర్థులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్లనే తాము గెలవబోతున్నామని, ప్రజలు నిశబ్ధఓటింగ్ ద్వారా తమకు మద్దతు పలికారని చెప్పుకొస్తున్నారు. మరొవైపు ప్రధాన పార్టీలను నమ్మకుండ ప్రజలు తమవైపు మొగ్గుచూపారని స్వతంత్రులు పేర్కొంటుండటం గమనార్హం.