ఖమ్మం

ఆ స్థానాలపైనే అందరి దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 10: ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రధాన నేతలు పోటీచేసిన స్థానాలపైనే రాష్టవ్య్రాప్తంగా చర్చ జరుగుతున్నది. ఖమ్మం జిల్లాలోనే ఈ నియోజకవర్గాలు ఉండటంతో మంగళవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఖమ్మంకు చేరుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరులో టీఆర్‌ఎస్ అగ్రనేత, రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తుండగా మధిరలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క పోటీలో నిలిచారు. ఇక ఖమ్మం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావుతో టిఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఢీకొన్నారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. టిఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధినేతలు కెసిఆర్, కెటిఆర్ ప్రచారం నిర్వహించగా నామా నాగేశ్వరరావుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సినీనటుడు వేణుతో పాటు అనేక మంది ప్రచారంలో పాల్గొన్నారు. భట్టివిక్రమార్కకు మద్దతుగా సినీనటి విజయశాంతి, కాంగ్రెస్ నేతలు మధుయాష్కి, వి హన్మంతరావు తదితరులు ప్రచారం నిర్వహించారు. కాగా తుమ్మల నాగేశ్వరరావుపై పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బంధువుగా ప్రచారం కావడంతో ఈ స్థానంపై పీసీసీ నేతలు కూడా దృష్టిపెట్టారు. అలాగే మధిర నియోజకవర్గంలో భట్టిపై పోటీచేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ గెలుపు కోసం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంతా తానై వ్యవహరించారు. అలాగే వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన లావూడ్యా రాములునాయక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీదారుగా నిలిచారు. సత్తుపల్లి నియోజకవర్గంలో టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు సండ్ర వెంకటవీరయ్యతో, ఇటీవల కాలం వరకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన పిడమర్తి రవి పోటీలో ఉన్నారు.
ఇదిలా ఉండగా ఈ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలపై తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు ఈ నియోజకవర్గాల్లో గెలుపోటములతో పాటు రాష్టస్థ్రాయిలో విజయంపై కూడా పందాలు కాస్తుండటం గమనార్హం. దీనిపై పోలీస్ వ్యవస్థ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ దానికి అందకుండా బెట్టింగుల్లో పాల్గొంటుండటం విశేషం.