ఖమ్మం

నేడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, డిసెంబర్ 10: ఓటర్లు, పార్టీల నాయకులు.. పోటీ చేసిన అభ్యర్థులు ఇలా అంతా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో అంతిమ విజేతలెవరో.. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తేలిపోనుంది. ఇన్నాళ్ల ఉత్కంఠకు కొద్ది గంటల్లోనే తెరపడనుంది. జయాపజయాలపై అభ్యర్థుల లెక్కేంటో తేలనుంది. అందరి భవితవ్యం తేటతెల్లమవనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నిచోట్లా హోరాహోరీ పోరు సాగడంతో ఓటర్ల నాడి అంతు చిక్కడం లేదని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. జిల్లాలో ఈసారి భారీగా పోలింగ్ కూడా నమోదైంది. పాల్వంచలోని అనుబోస్ కళాశాల వద్ద నిర్వహించే ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభ్యర్థులు ఏజెంట్లను సిద్ధం చేసుకున్నారు. వారంతా ముందురోజే అక్కడకు చేరుకున్నారు. లెక్కింపు ప్రారంభమైన గంటన్నరలోపే ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఈ నెల 7వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. పోలింగ్ సరళిపై రకరకాల విశే్లషణలు సాగాయి. ఎవరికి ఎలా ఉంటుందనే సర్వేలు హల్‌చల్ చేశాయి. మీడియా సంస్థలతో పాటు లగడపాటి వంటి ప్రముఖులు చేయించిన సర్వేలు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటిపైనే అభ్యర్థుల్లో ఉత్కంఠ సాగింది. మెజార్టీ సర్వేల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదనే పరిస్థితి ఉంది. ఒక్క లగడపాటి సర్వే మాత్రమే ప్రజా కూటమికి అనుకూలంగా ఉంది. ఈ సర్వేలు, ఊహాగానాలు ఎలా ఉన్నా కొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం ఏమిటో తెలిసిపోనుంది. వాస్తవానికి జిల్లాలో ఈసారి ఓటరు నాడి ఎవరికీ అంతుబట్టడం లేదు. టీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు ఎలా ఉందో అదే స్థాయిలో వ్యతిరేకత కూడా ఉంది. దీనికి తోడు ఈసారి బద్ధ శత్రువులైన కాంగ్రెస్‌తో తెదేపా జత కట్టడం, వారితో సీపీఐ, తెలంగాణ జన సమితులు కలసి రావడంతో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లాలో కూడా ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నెలన్నర ముందు వరకు టీఆర్‌ఎస్‌కు ఎదురే లేదని భావించగా ప్రజా కూటమి దూసుకురావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పైగా జిల్లాలో టీఆర్‌ఎస్ సిట్టింగ్‌లకే పెద్ద పీట వేయగా భద్రాచలంలో మాత్రమే కొత్త అభ్యర్థిని నిలబెట్టింది. కాంగ్రెస్ వీరికి దీటుగా అభ్యర్థులను రంగంలోకి దించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రచారంలో బలాబలాలు ప్రదర్శించిన నేతలు అదే రీతిలో ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రచారం ఏ రీతిలో సాగిందో పోలింగ్ కూడా అదే రీతిలో సాగింది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఈసారి 80శాతానికి పైగానే పోలింగ్ నమోదైంది. కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేటలో హోరాహోరీ పోరు జరగడంతో విజేతలెవరో విశే్లషకులు సైతం ఒక అంచనాకు రాలేకపోయారు. అభ్యర్థులు బూత్‌ల వారీగా తమకు నమోదైన ఓట్లతో లెక్కలు కట్టి గెలుపోటములను విశే్లషించుకున్నా ప్రతి ఒక్కరిలోనూ ఆశే ఉంది. ప్రధానంగా జిల్లాలో టీఆర్‌ఎస్, కూటమి మధ్యే ప్రధాన పోరు సాగింది. ఈ రెండు పార్టీలకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయన్నది స్పష్టం. కానీ ఎవరు గెలుస్తారన్న దానిపై మాత్రం నేడు ఫలితం రానుంది. పెరిగిన పోలింగ్ ఏ పార్టీకి మేలు చేస్తుందన్న ఉత్కంఠతకు కూడా నేడు తెరపడనుంది. నాలుగున్నరేళ్లలో తాము చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని టీఆర్‌ఎస్ అభ్యర్థులు నమ్మకంతో ఉన్నారు. ప్రజా వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ప్రజాకూటమి ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో నేడు వెలువడనున్న ఫలితాల్లో ఓటర్లు ఎటు నిలబడ్డారో, ఎవరికి పట్టం కట్టారో తెలిసిపోనుంది. ఇదిలా ఉంటే తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ ఫలితాలపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయని ముందు నుంచి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి నేడు వెలువడనున్న ఫలితాలపైనే ఉంది.