ఖమ్మం

రూ. 10.5 కోట్ల రైతుబీమా చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురంహవేలి, డిసెంబర్ 12: గత ఆగస్టు 14 నుండి ప్రారంభమైన రైతుబీమా పథకం ద్వార చనిపోయిన 201 మంది రైతుల కుటుంబాలకు 10 కోట్ల 5 లక్షల రూపాయలను ఆన్‌లైన్ ద్వార బ్యాంకు అకౌంట్లలో జమచేశామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎ ఝూన్సీలక్ష్మీకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1,47,117మంది రైతులు తమ పేర్లను నమోదుచేసుకున్నారని తెలిపారు. ఈ పథకంలో కుంట భూమి ఉన్నవారికి కూడా రైతు బీమా వర్తింస్తుందన్నారు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు భూమి కల్గియున్న రైతులు రైతుబీమా పథకానికి అర్హులన్నారు. రైతు ఏ విధంగా చనిపోయినప్పటికి వారి నామినికి చనిపోయిన 10రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. రైతు చనిపోయిన సమాచారాన్ని సంబంధిత ఎఇఒలకు తెలియజేయాలని వారి కుటుంబ సభ్యులకు సూచించారు. క్లైయిమ్ ఫారంను సంబంధిత ఎఇఒ పూర్తిచేసి ఆన్‌లైన్‌లో పొందుపర్చడం జరుగుతుందన్నారు. ఈ క్లైయిం ప్రక్రియ మొత్తం అన్‌లైన్‌లో జరుగుతున్నందున మధ్యవర్తుల్ని అశ్రయించి మోసపోవద్దని జెడి ఝూన్సీలక్ష్మీకుమారి హెచ్చరించారు.

నిరంతర మూల్యాంకనంపై మైసూర్ బృందం పరిశీలన
తిరుమలాయపాలెం, డిసెంబర్ 12: రాష్ట్రంలో అమలవుతున్న సమగ్ర నిరంతర మూల్యాంకన తీరుతెన్నులను రీజినల్ ఇనిస్టీట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ రాష్ట్ర పరిశీలకులు ఎఎస్ కరియప్ప మండలంలో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా బీరోలు, బచ్చోడు, తిమ్మక్కపేట ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. సమగ్ర నిరంతర మూల్యాంకనం ద్వారా అమలౌతున్న ప్రాజెక్ట్ పనులు, నిర్మాణాత్మక, పరీక్షల విధానం, మార్కుల పద్ధతి కాకుండా గ్రేడింగ్ ద్వారా అమలౌతున్న విద్యార్థుల సామర్థ్యాలు, ప్రొగ్రెస్ కార్డుల నిర్వాహణ, ఇతర భోదన, భోదనేతర విషయాలపై విద్యార్థులు ఉపాధ్యాయులతో చర్చించారు. సమగ్ర నిరంతర మూల్యాంకనం ప్రవేశ పెట్టినప్పటినుండి పాఠశాలలో భోదనలో నాణ్యత పెరిగిందా లేదా అన్న కోణంలో విద్యార్థులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల సమాధానాలను రికార్డు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర నిరంతర మూల్యాంకనంపై విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను క్రోడీకరించి ఒక నివేదికను విద్యాశాఖకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి యండి సర్ధార్‌పాషా, పాఠశాల ఉపాధ్యాయులు మాధవి, వసంత, అనితారాణి, నవీనాకుమారి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.