ఖమ్మం

టీఅర్‌ఎస్‌ను 7 లక్షల మంది ఓటర్లు అదరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురంహవేలి, డిసెంబర్ 14: జిల్లాలో టీఅర్‌ఎస్ పార్టీకి ఒక్క సీటు వచ్చినప్పటికి 7 లక్షలమంది ఓటర్లు అదరించారని రైతు సమన్వయ సమితి జిల్లా కో-అర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా టిఅర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కారు గుర్తుని పోలిన ట్రక్కు గుర్తుకు 17వేలమంది ఓటు వేశారన్నారు. టిఅర్‌ఎస్ పార్టీని ఆదరించిన ఓటర్లందరికి జిల్లా పార్టీ తరపున కృతజతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి 2వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసిఅర్‌తో పాటు టిఅర్‌ఎస్‌పార్టీ వర్కింగ్ ప్రసిడెంటుగా బాధ్యతలు చేపట్టిన కెటిఅర్‌కు ఖమ్మం జిల్లా తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఅర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతుబంధు వలన రాష్ట్రంలో రెండవసారి టిఅర్‌ఎస్ పార్టీ అఖండ విజయం సాధించిందన్నారు. దేశంలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని బయటపడేసేందుకు కెసిఅర్ జాతీయ రాజకీయాల్లో కీలకభూమి పోషించనున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంటుగా కెటిఅర్‌ను నియమించడం శుభపరిణామంగా పేర్కొన్నారు. కెటిఅర్ అధ్వర్యంలో గ్రామస్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు టిఅర్‌ఎస్ పార్టీ బలోపేతం కాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రం అంతా ఒక ఎతైతే, ఖమ్మం మరో ఎతె్తైందన్నారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గం టిడిపి వైపు మరలడం వలన కూటమి గెలుపుకు దోహదపడిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమరావతికి దాసోహం పల్కకుండా ఇప్పటికైనా మన తెలంగాణ అన్న భావన వస్తే మంచిదని హితవు పలికారు. పార్టీ వెన్నుపోటుల వలనే జిల్లాలో టిఅర్‌ఎస్‌పార్టీ ఓటమి పాలయిందన్నారు. మధిర నియోజక వర్గంలో భట్టి విక్రమార్క ఎన్నికల చివర రోజున కోట్లరూపాయలతో సిపిఎం, బిఎల్‌ఎఫ్ ఓట్లను కోనుగొలు చేసి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు గెలిచాడని ఎద్దెవా చేశారు. జిల్లా లో భట్టివిక్రమార్క డబ్బులు పంచిన విధంగా మరెవరు పంచలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసిఅర్‌పై బురదజల్లకుండా మధిర నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటేమంచిదన్నారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో ఓటర్లు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో టిఅర్‌ఎస్ సత్తాను చాటుతామన్నారు. ఈ సమావేశంలో టిఅర్‌ఎస్ నాయకులు మందడపు సుధాకర్, తిరుమలరావు, భీరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెండోసారి గిన్నీస్ రికార్డ్ సాధించిన యోగమయూరి సరస్వతి
పాల్వంచ రూరల్, డిసెంబర్ 14: ఇటీవల చెన్నైకి సమీపంలోని మెరీనా బీచ్‌లో యువ యోగ మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో పాల్వంచకు చెందిన యోగమయూరి అవార్డు గ్రహీత అంగలూరి సరస్వతి కందరాసనం చేసి రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు గిన్సీస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం లభించింది. గతంలో కూడా సరస్వతి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం సరస్వతి విలేఖరులతో మాట్లాడుతూ తనకు రెండోసారి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం దక్కడం గర్వంగా ఉందన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ యోగా ఎంతో అవసరమని, స్ర్తిలు ఆత్మ విశ్వాసం పెంచుకోడానికి, మానసిక ఒత్తిడి తగ్గించుకోడానికి యోగ సాధన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తాను ఐదు సంవత్సరాలుగా యోగ సాధన చేస్తున్నానని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ యోగా అలవాటయ్యేలా చేస్తానని అన్నారు.
పాదయాత్రగా కాశీ వెళ్తున్న వృద్ధ దంపతులు
కూసుమంచి, డిసెంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరానికి చెందిన వృద్ధ దంపతులు మాగంటి రాంబాబు, శ్యామలాదేవి దంపతులు ఈనెల 2న భీమవరం నుండి కాశీకి కాలి నడకన కాశీయాత్రకు బయలుదేరారు. వారి యాత్ర శుక్రవారం కూసుమంచి గ్రామం చేరుకుంది. ఈ వయస్సులో కాశీ యాత్రకు కాలినడకన బయలుదేరి వెళ్ళడం తమకు శివుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నామని తెలిపారు.
సంస్కృత భాషను విస్తృతంగా ప్రచారం చేయాలి
ఖమ్మం(క్రైం), డిసెంబర్ 14: సంస్కృత భాషను నలుదిశల వ్యాప్తి చేసేందుకు సాహితీవేత్తలతో పాటు ప్రతి ఒక్కరు పాటుపడాలని సంస్కృత భారతి ప్రధాన ప్రచారక్ దత్తాత్రేయ, బాధ్యులు ఉమేష్ త్రివేదిలు అన్నారు. శుక్రవారం స్థానిక గాయత్రి భవన్‌లో సంస్కృత భారతి జిల్లా శాఖ నిర్వహించిన ప్రారంభోత్సవ సమావేశంలో వారు మాట్లాడుతూ సంస్కృతి భాషను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. అనంతరం సంస్కృత భారతి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కోదండ రామాచార్యులు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ సోమరాజు రామకిషన్‌రావు, అడుసుమల్లి ప్రభాకర్‌శర్మ, కార్యదర్శిగా అట్లూరి వెంకటరమణ, కోశాధికారిగా లంకా శ్రీనివాసరావులను ఎన్నుకున్నారు.