ఖమ్మం

పోడుసాగుదార్లుకు పట్టా హక్కు కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, జనవరి 16: అర్హులైన పోడుభూముల సాగుదారులందరికి పట్టాహక్కు కల్పించి రైతుబంధు పథకం వర్తింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. గార్ల మండలం పెద్దకిష్టాపురం గ్రామంలోని గార్ల మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ గంగావత్ లక్ష్మణ్‌నాయక్ ఇంట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆటవీ శాఖ విధిస్తున్న అడ్డంకులు వల్ల పోడుసాగుదారులంతా పట్టాహక్కు పొందలేకపోతున్నారని, సాగుదార్ల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సర్వేకి అదేశించారని, పూర్తిస్థాయి సర్వే అనంతరం అర్హులైన పోడుసాగుదారులందరికి పట్టాహక్కుతో పాటు రైతుబంధు, రైతు బీమా వర్తింపజేస్తామన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాల వల్లే తిరిగి రెండో సారి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని, దీనిని జీర్జించుకోలేని వారు టిఆర్‌ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కెసిఆర్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇకనైన అయా పార్టీలు తమ విధానాలు మార్చుకోకపోతే పరిణామాలు మరో విధంగా ఉంటాయని సీతారాంనాయక్ హెచ్చరించారు. గార్ల మండలంలో నెలకొని ఉన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తానని, ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు తన పార్లమెంటు నిధుల నుంచి 15లక్షల రూపాయాలను విడుదల చేస్తానని హామీనిచ్చారు. ఈ సమావేశంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, గార్ల జడ్పీటిసి ఎద్దు మాధవి, పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు వడ్లమూడి దుర్గాప్రసాద్, గార్ల సర్పంచ్ ఆజ్మీరా బన్సీలాల్, గార్ల మాజీ సర్పంచ్ లక్ష్మణ్‌నాయక్, నాయకులు భూక్య నాగేశ్వరరావు, కిషన్, చిలివేరు శంకర్, ఎండి ఖధీర్‌బాబా, చాంద్‌మల్ తదితరులు పాల్గొన్నారు.