ఖమ్మం

పేదల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, ఫిబ్రవరి 13: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్టమ్రుఖ్యమంత్రి కెసిఆర్ పని చేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. బుధవారం స్థానిక మార్కెట్ కమిటి కార్యాలయ ప్రాంగణంలో అగ్నిమాపక నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ కేంద్రమైన వైరాలో అగ్నిమాపక కేంద్రం కావడం ఈప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా కెసిఆర్ పనిచేస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆయన పని చేయడం, ప్రజలు కోసం అహర్నిశలు పనిచేసే ముఖ్యమంత్రి మనకు దొరకడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రాన్ని ఈప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హైదరాబాద్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 101, వైరా అగ్నిమాపక కేంద్రం ఫోన్‌నెంబర్ 08749 - 252101 కి ఫోన్ చేసి ఉపయోగించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి జయప్రకాష్, జడ్పిటీసి బొర్రా ఉమాదేవి, ఎంపిపి బొంతు సమత, ముళ్ళపాటి సీతారాములు, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, గుమ్మా రోశయ్య, సూతకాని జైపాల్, టిఆర్‌ఎస్ నాయకులు దార్న శేఖర్, సూరంపల్లి రామారావు, రాయల పుల్లయ్య, పసుపులేటి మోహన్‌రావు, పుల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.

మాచినేనిపేట తండాను అభివృద్ధిలో ముందుంచుదాం
* ఎంపీపీ మూడు చిట్టిబాబు
జూలూరుపాడు, ఫిబ్రవరి 13: మాచినేనిపేట తండా గ్రామ పంచాయతీని అభివృద్ధిపథంలో ముందుంచేందుకు సమిష్టి కృషితో శ్రమిద్దామని ఎంపిపి మూడు చిట్టిబాబు కోరారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పాలకమండలితో తొలిసారిగా ఏర్పాటు చేసిన గ్రామసభకు ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన వౌళిక వసతులను గుర్తించి సమస్యలను పరిష్కరించటం తొలి ఎజెండాగా రూపొందించుకుందామని అన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారుల నిర్మాణాలను చేపట్టడం, పంట పొలాలకు వెళ్లే రహదారులను మరమ్మత్తులు చేయటం, సాగు నీటి వసతులైన చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల్లో పూడికతీత వంటి పనులపై దృష్టి సారించాల్సిన అవసరముందని గుర్తు చేశారు. ఇంతే కాకుండా గ్రామంలోని పేదలు ప్రతి ఒక్కరికి గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా పనులు కల్పించేందుకు అర్హులైన అందరికీ ఉపాధి కార్డులు అందించేందుకు కృషి చేయటం జరుగుతుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్థుల సహకారంతో స్వచ్చ్భారత్ కార్యక్రమాన్ని నిర్వమించి క్లీన్ అండ్ గ్రీన్ కోసం శ్రమించటం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను నూరు శాతం పూర్తిచేసి మండలంలోని తొలి ఓడిఎఫ్ పంచాయతీగా ప్రకటించే విధంగా సమిష్టిగా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్థుల నుంచి సభలో సమస్యలతో కూడిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సభలో సర్పంచ్ లావుడ్యా భారతి, ఉప సర్పంచ్ లకావతు బుజ్జి, లకావతు లచ్చీరాం, బానోతు చిన్నా, వార్డు సభ్యులు బోడా రాంనాయక్, లకావత్ సేవా, భూక్యా చిన్నా, బానోతు లక్ష్మి, వాంక్డోతు బాలి, గోలి కృష్ణవేణి, ఇజిఎస్ సాంకేతిక సహాయకురాలు సుహాసిని, ఎఫ్‌ఎ మూడు రమేష్, అంగన్‌వాడీ టీచర్స్, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.