ఖమ్మం

విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 13: విద్యార్థి దశ నుండే విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్గించాలని సీనియర్ సివిల్ జడ్జి వినోద్‌కుమార్ అన్నారు. శ్రీనగర్‌కాలనీలోని రెజొనెన్స్ పాఠశాలలో బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లీగల్ లిట్రసీ క్యాంపులో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, నైతిక విలువలతో కూడిని సంస్కారాన్ని నేర్పించడంతో పాటు భారతీయ చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సత్వర శాశ్వతమైన న్యాయాన్ని అందించేందుకు న్యాయవ్యవస్థకు సమాంతరంగా న్యాయసేవాధికారక సంస్థ పనిచేస్తుందని తెలిపారు. ప్రతి రెండవ శనివారం లోక్‌అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. సమాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలకు గురౌతున్న బాదితులకు న్యాయం అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. వార్షిక ఆదాయం లక్షలోపు ఉన్నవారు, దివ్యాంగ బాదితులకు, జాతీయ విపత్తుల సంధర్భాలలో జిల్లా న్యాయసేవాధికారిక ద్వారా ఉచిత సేవలు అందిస్తున్నామన్నారు. సీనియర్ న్యాయవాది దేవకి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో వివిధ కేసులలో ఉన్న బాదితుల మద్య అవగాహన ఒప్పందం కుదిర్చి సత్వర న్యాయం అందిస్తూ ధనం, సమయం వృధా కాకుండ న్యాయసేవాధికారిక సంస్థ తోడ్పాటు అందిస్తుందని, దానిని బాదితులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెజొనెన్స్ డైరెక్టర్లు కొండా శ్రీ్ధర్‌రావు, ఆర్‌వి నాగేంద్రకుమార్, కృష్ణవేణి, నీలిమ, ప్రిన్సిపాల్ ఎం ప్రసన్నరావు, ఉపాద్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె ప్రగతికి పాటుపడండి
* సర్పంచ్‌ల సన్మాన సభలో పువ్వాడ
ఖమ్మం(జమ్మిబండ), ఫిబ్రవరి 13: పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి జరుగుతుందని, ప్రజాప్రతినిధులుగా పల్లెల అభివృద్ధికి పాటుపడాలని సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు సూచించారు. బుధవారం సిపిఐ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల సమావేశం ఖమ్మం గిరిప్రసాద్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల వ్యయం భారిగా పెరిగిందని, ఆర్థికంగా వివిధ రంగాల్లో సంపాధించిన వారు ఎన్నికల్లో గెలుపు కోసం ఖర్చు పెడుతున్నారని, అటువంటి శక్తులను తట్టుకొని నిలబడటం సామాన్యమైన విషయం కాదన్నారు. ఖమ్మం జిల్లాలో 17గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లుగా, 19పంచాయతీలో ఉప సర్పంచ్‌లను సిపిఐ గెలుచుకోవడం గర్వించదగిన విషమన్నారు. పాలకవర్గాలు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని, నిధుల కేటాయింపు లేక పల్లెలు అభివృద్ధి జరగడం లేదన్నారు. నూతనంగా ఎన్నికైన వారు నిధుల కోసం పోరాటం చేయవల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు జితేందర్‌రెడ్డి, నాగేశ్వరరావు, లతాదేవి, వెంకటేశ్వరరావు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.