ఖమ్మం

సత్తుపల్లి జిల్లా సాధన కోసం పొలిటికల్ జేఏసీ ఆవిర్భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, మార్చి 14: సత్తుపల్లి జిల్లా సాధన కోసం వివిధ రాజకీయ పార్టీలతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటయింది. గురువారం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వివిధరాజకీయ పార్టీల నాయకులు పొలిటికల్ జెఎసి ద్వారా భవిష్యత్తు జిల్లా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో తొలుత ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల గురించి చర్చించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ,స్వచ్ఛంద సంస్థలు, 114 సంఘాలు జిల్లా సాధన ఉద్యమానికి ఎంతో సహకరించాయని ధన్యవాదాలు తెలిపారు.
పొలిటికల్ జేఏసీ
సత్తుపల్లి జిల్లా సాధన కోసం ఏర్పాటైన పొలిటికల్ జెఎసి చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడతనేని అప్పారావు, కన్వీనర్‌గా తెలంగాణ జనసమితి సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు గాదె నర్సింహారెడ్డి, కో-కన్వీనర్‌గా మోరంపూడి పాండు, సీపీయం దండు ఆదినారాయణ,సీపీఐ మందపాటి రవీంద్రారెడ్డి, టిఆర్‌ఎస్ కోట సత్యనారాయణ టిడిపి, నాయుడు రాఘవరావు, బిజెపి గంటా శ్రీనివాసరావు, సీపీఐ (యంఎల్) ఎన్డీలతో జెఎసి ఏర్పాటయింది. కాగా శుక్రవారం విస్తృత స్థాయి సమావేశం సత్తుపల్లి జిల్లా సాధన ఉద్యమానికి అనేక విధాలుగా సహకరించిన 114 సంఘాలతో శుక్రవారం సాయంత్రం 3గంటలకు కళాభారతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

విలీన గ్రామపంచాయతీల్లో రికార్డుల స్వాధీనం
ఖమ్మం రూరల్, మార్చి 14: ఖమ్మం నగరంలో విలీనమైన గ్రామపంచాయతీల రికార్డులను ఖమ్మం కార్పొరేషన్ అధికారులు గురువారం స్వాధీనపర్చుకున్నారు. ఖమ్మం కార్పోరేషన్‌లో ఖమ్మం రూరల్ మండల పరిధిలోని గుదిమళ్ళ, వెంకటగిరి, గుర్రాలపాడు, ఏదులాపురం, పెద్దతండా, పోలేపల్లిలోని రాజీవ్ గృహకల్ప గ్రామపంచాయతీలను ప్రభుత్వం విలీనం చేసింది. దీంతో ఆయా గ్రామపంచాయతీలకు చెందిన ప్రజలు తమ గ్రామపంచాయతీలను ఖమ్మం కార్పోరేషన్‌లో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈవిషయంపై హైకోర్టు విచారణ జరిపి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించి స్టే విధించింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పరిశీలించిన కోర్టు సదరు గ్రామపంచాయతీల విలీనం సబబేనని ఇటీవలే తీర్పునిచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయగా కార్పోరేషన్ అధికారులు విలీన గ్రామపంచాయతీలకు వెళ్ళి రికార్డులు, విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈప్రక్రియతో విలీన గ్రామపంచాయతీలన్నీ కార్పోరేషన్ పరిధిలోకి వెళ్ళాయి. కార్యక్రమంలో మున్సిపల్ ఏసీపీలు రాంచంద్, సురేష్‌బాబు, డీవైఈఈలు ప్రవీణ్‌కుమార్, సుబ్రహ్మణ్యం, రంగారావు, టీపీవో శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.