ఖమ్మం

పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఏప్రిల్ 9: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌షైనీ తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 5 నియోజకవర్గాలను కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు నియోజకవర్గ ప్రాంతాలుగా గుర్తించిందన్నారు. జిల్లాలోని 1079 పోలింగ్ కేంద్రాలలో పలు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఇవిఎంలను, వివి ప్యాడ్‌లను పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 160 వెబ్ కాస్టింగ్‌లు, 300 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2వేల మంది పోలీస్ సిబ్బందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 162మంది మైక్రో అబ్జర్వర్స్‌తో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో 11 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక, 18 కేంద్రాలు అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలలో 436 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలలో 645 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసి ఎన్నికల విధుల నిర్వహణ కోసం 4732 మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఈవిఎంలు, వివిప్యాడ్‌ల వద్ద సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచామన్నారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు ఓటుహక్కు వినియోగించుకునేందుకు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటుచేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 13వేల మందికి పైగా వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు 14రకాల గుర్తింపుకార్డులలో ఏదైన ఒకటి పోలింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్‌దత్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ ముందస్తు చర్యలు చేపట్టిందని అన్నారు. 425మంది రౌడీషీటర్లకు కౌనె్సలింగ్ ఇవ్వడంతో పాటు 3485 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ నివారణకు నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 2.40 లక్షల డబ్బులను సీజ్‌చేయడంతో పాటు 8లక్షల విలువచేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 243కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు ప్రకటించారు. భద్రాచలం నియోజకవర్గంలో 155నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల పోలింగ్‌కేంద్రాలు గుర్తించామన్నారు. సిఆర్‌పిఎఫ్, ఎఆర్, సివిల్ పోలీసుల ద్వారా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి, పౌర సంబంధాల శాఖాధికారి శ్రీరాం శ్రీనివాసరావు పాల్గొన్నారు.