ఖమ్మం

ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మే 17: ఐదవ షెడ్యూల్డ్ భూభాగం ఆదివాసీల ప్రాంతం కాబట్టి నూతన జిల్లాల ఏర్పాటులో మొదటిగా ప్రభుత్వం భద్రాచలం ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకురాలు కెచ్చెల కల్పన డిమాండ్ చేశారు. భద్రాచలం ఆదివాసీ జిల్లా సాధనకై జీఎస్పీ, జీవీఎస్పీ, ఏటీఎఫ్ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం భద్రాచలం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముర్రం వీరభద్రం మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నందున ఆదివాసీ జిల్లా ఏర్పాటు విషయంలో హైకోర్టును ఆశ్రయించాలని సలహా మండలి తీర్మానించినట్లు చెప్పారు. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్డ్ ఆదివాసీల స్వయం పాలనను సూచిస్తుందని, ఏజెన్సీలో 24 ఆదివాసీ మండలాలు ఉన్నందున మైదాన ప్రాంతంలో జిల్లాను ఏర్పాటు చేయడం విరుద్ధమన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. దీనిపై ఇప్పటికై హైకోర్టు సీనియర్ న్యాయవాదుల సలహా తీసుకున్నామని చెప్పారు. మాజీ జడ్పీ ఛైర్మన్ చందాలింగయ్య దొర మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. భద్రాచలం ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేసి న్యాయం చేయాలని కోరారు. దీక్షల్లో సోడి చలపతి, ఇర్పా ప్రకాష్, పూనెం పార్ధు, వంక వరాలబాబు, కారం రాము, కన్నారావు, పూనెం కృష్ణదొర, పూనెం రమణబాబు కూర్చున్నారు.