ఖమ్మం

మహిళలే నిర్ణేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, మే 17: ఉత్కంఠబరితంగా జరిగిన పాలేరు ఉప ఎన్నికల భవితవ్యంపై మహిళలపైనే ఆధారపడి ఉంది. ఈ మండలంలో మహిళలు పురుషుల కంటే అధికంగా ఓటు వేసి తమ చైతన్యాన్ని తెలియజేశారు. మండలంలోని మొత్తం 42,036 మంది ఓటర్లు ఉండగా వారిలో 38,152 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా వీరిలో పురుషులు 18,726 మంది, స్ర్తిలు 19,428 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో మహిళలు అధికంగా ఓటుహక్కు వినియోగించుకోవడంతో వారి చైతన్యనాన్ని తెలియజేస్తుంది. వారి తీర్పు ఎటువైపు ఉండబోతుందో ఈ నెల 19వ తేదీన తెలియనున్నది.

క్రీడా పాఠశాలకు విద్యార్థుల ఎంపిక
దుమ్ముగూడెం, మే 17: ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న క్రీడా పాఠశాలకు విద్యార్థుల ఎంపిక ఈనెల 19వ తేదీన కె.రేగుపల్లి ఆశ్రమ పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎస్.రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 సంవత్సరాలు వయస్సు నిండిన విద్యార్థులకు నాలుగు, ఐదు తరగతుల్లో ప్రవేశానికి ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తింపు పత్రాలను తీసుకు రావాలని ఆమె కోరారు.