ఖమ్మం

ఆదివాసీలకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, మే 17: ప్రకృతి సంపదను కాపాడుతున్న ఆదివాసీలకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రకృతి సంపదను కాపాడేందుకు అత్యధికంగా ఆదివాసీలేనని, కొంతమంది అధికారులు చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకునేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు. ఆదివాసి, దళిత మహిళ, మైనార్టీ ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోలీస్, పారా మెడికల్ బలగాలకు వ్యతిరేకంగా పోరాడాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు ఆదివాసిలంతా అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అనంతరం సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు.