ఖమ్మం

ప్రధాన డిమాండ్ల సాధన కోసం సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మే 17: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 25వతేదీన సింగరేణి వ్యాప్తంగా అన్నిగనులు, డిపార్టుమెంట్ల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయూనియన్ రాష్ట్ర డెప్యూటీ ప్రధాన కార్యదర్శి దమ్మాలపాటి శేషయ్య, కేంద్ర కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, కొత్తగూడెం ఏరియా బ్రాంచి కార్యదర్శి కూసన వీరభద్రయ్యలు తెలిపారు. స్థానిక శేషగిరిభవన్‌లో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ జూన్ 3వతేదీన యూనియన్ ఆధ్వర్యంలో యాజమాన్యానికి సమ్మెనోటీసు ఇచ్చి అన్ని యూనియన్ల సహకారంతో నిరవధిక సమ్మెకు కూడా సిద్దవౌతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ జూన్ 2వతేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా సింగరేణి కార్మికులకు సకలజనుల సమ్మె వేతనం, వారసత్వ ఉద్యోగాల పునరుద్దరణ తదితర అంశాలను ప్రకటించి వాగ్ధానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈనెల 25న నిర్వహించే ధర్నా కార్యక్రమాలను ప్రధానంగా వారసత్వ ఉద్యోగాలు, సకలజనుల సమ్మె వేతనం, ఐదు భూగర్భగనులను ప్రైవేటీకరించే గ్లోబల్‌టెంటర్లను రద్దుచేయడం, సింగరేణి కార్మికులకు సొంతింటిపథకం, మెరుగైన 10వవేజ్‌బోర్డు ఏర్పాటు తదితర డిమాండ్లతో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈసమావేశంలో కార్పోరేట్ కార్యదర్శి వంగా వెంకట్, బ్రాంచి సహాయ కార్యదర్శి ఎం అప్పారావు, నాయకులు డి రామనాధం, కె రాజయ్య, వట్టికొండ ప్రసాద్, శేషగిరి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

*