ఖమ్మం

క్రీడలతో ఆరోగ్యకరమైన సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 9: క్రీడలు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం ద్వారా రేపటి ఆరోగ్యమైన సమాజానికి వారు ఉపయోగపడేలా దోహదపడుతాయని సింగరేణి జిఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్‌ఆర్ ఆనందరావు అన్నారు. సింగరేణి కార్పోరేట్ ఏరియా ఆధ్వర్యంలో వివిధ క్రీడల్లో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమం గురువారం స్థానిక ప్రకాశంస్టేడియంలో జరిగింది. ఈకార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కంపెనీ ఉద్యోగులకే కాకుండా పరిసర ప్రాంత కుటుంబాలకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మే 7న ప్రారంభమైన వేసవిశిక్షణ శిబిరాలు నెలరోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఉషూ, బాక్సింగ్‌లే కాకుండా చిత్రలేఖనంలో కూడా నిపుణులైన వారిచే శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న 340మంది పిల్లలకు శిక్షణ సర్ట్ఫికెట్లతో పాటు టీషర్టు, క్యాప్‌లను బహుకరించారు. గుర్తింపుసంఘం ఉపాధ్యక్షులు ఆర్ కోమరయ్య, ప్రాతినిధ్యసంఘం ప్రతినిధి వలసకుమార్, డబ్ల్యూపిఎస్ అండ్ జిఎ గౌరవ కార్యదర్శి వరప్రసాద్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పాస్‌నెట్, ఇజాజ్‌షరీఫ్ పాల్గొన్నారు.