ఖమ్మం

భద్రాద్రిలో ఆపదుద్ధారక స్తోత్ర పారాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 17: భద్రాద్రి రాముని సన్నిధిలో నిర్వహిస్తున్న శతవర్ష ప్రయుక్త సువర్ణ్భద్రకవచ సమర్పణాత్మక నవాహ్నిక శ్రీరామ క్రతువులో భాగంగా గురువారం విశిష్ట సేవగా ఆపదోద్ధారక స్తోత్ర విరాట్ పారాయణం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆపదుద్ధారక స్తోత్ర పుస్తకాలను శిరస్సుపై ధరించి ఆరుట్ల శ్రీనివాసాచార్యులు స్వామి వారి మూలవరుల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చిత్రకూట మండపం వద్ద వేదికపై ఆపదుద్ధారక స్తోత్ర పుస్తకాలను దేవస్థానం ఈవో కె.జ్యోతి ఆవిష్కరించారు. మహాక్రతువులో భాగంగా యుద్ధకాండ పారాయణం చేశారు. అంతకు ముందు యాగ మండపంలో తిరువారాధన, మంగళశాసనం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. యాగశాలలో చతుర్వేదాది పారాయణాలు, చతుస్థానార్చనాలు శ్రీరామ మంత్ర హోమాలు సంప్రదాయబద్ధంగా రుత్విక్‌లు నిర్వహించారు. సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణం, చతుస్థానార్చనం నిర్వహించారు. శ్రీరామ మహాక్రతువులో భాగంగా ప్రతిరోజు రామాయణంలోని 20 సర్గలను పారాయణం చేసి హోమం నిర్వహిస్తున్నారు. సకలవిధ రాజలాంఛనాలతో సకలసార్వభౌమ సేవను శుక్రవారం నిర్వహించనున్నారు. శ్రీరామ మహాక్రతువుకు శుక్రవారం మహా పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం శ్రీరామ మహా పట్ట్భాషేకాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.