ఖమ్మం

వికలాంగులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపుర హవేలి: జిల్లాలోని అనేక విభాగాల్లో పని చేస్తున్న శారీరక వికలాంగులు స్థైర్యవంతులని జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ శారీరకంగా వికలాంగులు అయినప్పటికీ మానసికంగా వారిలో మేథాశక్తి అధికంగా ఉంటుందన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని హామీనిచ్చారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి సమస్యను వివరిస్తానని హామీనిచ్చారు. సంఘం రాష్ట్ర నాయకులు రాములు మాట్లాడుతూ ఎవరైనా దొంగ సర్ట్ఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు పొందినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తామెప్పుడు ముందుంటామని హామీనిచ్చారు. తొలుత సంఘం క్యాలెండర్, డైరిలను ఆమె ఆవిష్కరించారు. అనంతరం పిఆర్‌టియు నాయకులు కృష్ణమోహన్, టిపిటిఎఫ్ నాయకులు విజయ్, యుటిఎఫ్ నాయకులు నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ఏబుల్డ్ వెల్ఫేర్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి నాగేశ్వరరావు, ఈదయ్య, శ్రీనివాసరావు, సత్య నారాయణ, లింగయ్య, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
ఖమ్మం(మామిళ్ళగూడెం), మార్చి 20: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య ఆరోపించారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో తప్పుడు హామీలను ఇచ్చి నెరవేర్చకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తుందని, ఇందుకు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెబల్స్‌ను గెలిపించిన తీరు తెలుపుతుందన్నారు. 2019 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీని బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు బలమైన నాయకత్వానికి తయారు చేసుకోవాలన్నారు. ఈ నెల 29వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని డివిజన్‌లలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మద్దినేని బేబి స్వర్ణకుమారి, కూరపాటి వెంకటేశ్వర్లు, తోటకూరి శివయ్య, ఏలూరి శ్రీనివాసరావు, హన్మంత్‌రెడ్డి, జయకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు మెచ్చిన నేత వెంకటరెడ్డి

కామేపల్లి, మార్చి 20: ప్రజాభిమానం కలిగిన మంచి రాజకీయవేత్త రాంరెడ్డి వెంకటరెడ్డి అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పాతలింగాల గ్రామంలోని దివంగత నేత, మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాంరెడ్డి సోదరులు దామోదర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, వెంకటరెడ్డి సతీమణి సుచరితతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని ప్రకటించారు. అహంభావం లేని మంచి హృదయం కలిగిన రాజకీయ నేత అని, తనతో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని, పలుసార్లు ఎన్నికల్లో తాము కలిసి పనిచేశామన్నారు. మంచినేతను కోల్పోవడం ఎంతో విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటరెడ్డి, జిల్లా సిపిఐ నాయకులు ఏపూరి బ్రహ్మం, నారాయణ సతీమణి వసుమతిదేవి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలి

ఖానాపురం హవేలి, మార్చి 20: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కార్పొరేషన్ మేయర్ డాక్టర్ పాపాలాల్ అన్నారు. శనివారం రాత్రి స్మార్ట్‌కిడ్జ్ పాఠశాల 4వ వార్షికోత్సవ స్థానిక సప్తపది ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్ పాపాలాల్ మాట్లాడుతూ విద్యార్థులను చదువుల్లో ముందంజలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు అవసరం ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డిఎస్పీ సురేష్‌కుమార్, ఉపమేయర్ బత్తుల మురళీప్రసాద్, ఆర్జెసి కృష్ణ, మువ్వా శ్రీనివాసరావు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేయగా, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, మేడా ప్రశాంతలక్ష్మి, పాఠశాల ప్రిన్సిపాల్ కవిత తదితరులు పాల్గొన్నారు.
* మేయర్ పాపాలాల్