ఖమ్మం

విద్యాసంస్థల్లో ఫీజులు తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, జూన్ 24: ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక పలుప్రయివేటు పాఠశాలల ముందు వివిధ ప్రజాసంఘాలు ధర్నా నిర్వహించాయి. శుక్రవారం పట్టణంలోని మధు విద్యాలయం, న్యూ లిటిల్‌ప్లవర్స్ పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ పాఠశాలల్లో ఫీజుల వివరాలు, సిబ్బంది విద్యార్హతలు, వారి వేతన వివరాలు నోటీస్ బోర్డులో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబందనల ప్రకారం నడుచుకుంటామని హామీ ఇచ్చిన ప్రయివేటు విద్యాసంస్థలు ఈనాడు నిబంధలను గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తెచ్చిన జి.వో. నెం. 42, విద్యాశాఖ ఇతర నిబంధనలు తుంగలో తొక్కారని ఆయన అన్నారు. పాఠశాల ఆవరణలో యూనిఫాం, ఇతర సామగ్రి అమ్మకూడదని ఆయన అన్నారు. ప్రతి ప్రయివేటు పాఠశాలలోని తరగతి గదిలో 25%శాతం పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని ఆయన గుర్తుచేశారు. ఈవిషయానికి స్పందించిన మధువిద్యాలయ కరస్పాండెంట్ రంజిత్ ప్రభుత్వ జి.వో. కాపి ఇవ్వండి తప్పనిసరిగి అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో అవినాష్, శ్రీకాంత్, హరీష్, కొంగర సుధాకర్, అఫ్జల్, శేషగిరి, నాగరాజు, రజిత, లక్ష్మీతులసి, ప్రమీల, కృష్ణవేణి పాల్గొన్నారు.