ఖమ్మం

ముగిసిన దేహదారుఢ్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), జూలై 3: గత నెల 27న ప్రారంభమైనా ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షలు ఆదివారం ముగిశాయి. ఈ పరీక్షలకు 8157మంది అభ్యర్థులు రాత పరీక్ష ద్వారా ఎంపిక కాగా వీరిలో 7219మంది పురుషులు, 938మంది మహిళలు ఉన్నారు. జిల్లా ఎస్పీ షాన్‌వాజ్‌ఖాసీం పర్యవేక్షణలో ఎఎస్పీలు సాయికృష్ణ, భాస్కరణ్, డిఎస్పీలు అశోక్‌కుమార్, రామిరెడ్డి, సాయిశ్రీ, విరేశ్వరరావు, సురేష్‌కుమార్, డిపివో ఎవో సత్యకుమార్, ఫిజకల్ డైరెక్టర్లు పలువురు సిబ్బంది ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరెడ్‌గ్రౌండ్‌లో వారం రోజుల పాటు సాగిన దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థుల నుంచి ధృవీకరణ పత్రాలను బయోమెట్రిక్ విధానం ద్వారా పరిశీలించారు. అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలు, వంద మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, షార్ట్ఫుట్ ఈవెంట్స్‌ను నిర్వహించారు. అవకతవకలకు తావులేకుండా వీడియో చిత్రికరించారు. ఈ పరీక్షలకు వర్షం ఆటంకంగా మారడంతో రెండు రోజుల పాటు కొంత అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపిలేని వర్షాలతో మొదటి రెండు రోజులు గ్రౌండ్ ఈవెంట్స్‌కు అనుకూలంగా లేకపోవడంతో పోలీసులు ఇసుకతో మైదానాన్ని చదును చేశారు. దీంతో పోలీసులు సైతం ఈ ఈవెంట్స్ వారికి పరీక్షాగా మారాయి. వర్షం కారణంగా రెండు రోజుల పాటు నిలిచిపోయిన అభ్యర్థులకు జులై 1,2 తేదిల్లో తిరిగి ఈవెంట్స్‌ను నిర్వహించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను కల్పించారు.
రంజాన్ మాసం కావడంతో పరీక్షలకు హాజరు కాని ముస్లిం అభ్యర్థులకు ఈ నెల 9న ఈవెంట్స్‌ను నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. మొత్తం 8157మంది అభ్యర్థులకు గాను 6681మంది హాజరు కాగా వీరిలో 3480మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.