ఖమ్మం

ప్రజానాట్యమండలి పేదోడి పక్షమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), జూలై 3: ఎన్ని కష్టాలొచ్చినా, ఆకలితో కడుపులు మాడినా పేదోడి సమస్యలపై గళం విప్పడమే ప్రజానాట్యమండలి లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. స్థానిక మంచికంటి భవన్‌లో ఆదివారం ప్రజానాట్యమండలి జిల్లా 10వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కోశాధికారి భిక్షమయ్య, నాయకులు దేవేంద్రలు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కోంటున్న అనేక సమస్యలను ప్రజానాట్యమండలి కార్యకర్తలు పాటల రూపంలో వారికి అర్ధమయ్యే విధంగా తెలియజేస్తారన్నారు. ముందుగా ప్రజానాట్యమండలి సీనియర్ నాయకుడు మేకల శేషిరెడ్డి ప్రజానాట్యమండలి జెండాను ఆవిష్కరించారు. ఈ మహాసభలకు ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు ఎఎస్ కుమార్, నాయకులు విజయ్‌కుమార్, గౌతమిలు అధ్యక్ష వర్గంగా వ్యవహారించారు. ఖాదర్‌బాబు పలువురి అపజానాట్యమండలి, సినీ కళాకారుల మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. సభ ఈ సందర్భంగా 2 నిమిషాలు వౌనం పాటించి, సంతాపం తెలిపింది. నివేదికను జిల్లా కార్యదర్శి కె జోజి ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మచ్చా రంగయ్య, నాయకులు కనె్నకంటి వెంకటయ్య, పిఎన్‌ఎం మాజీ నాయకులు నామా లక్ష్మీనారాయణ, చేడే పుల్లయ్య, మల్లయ్య, చెరుకుపల్లి వెంకటేవ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ ఏకగ్రీవంగా ప్రకటించింది. జిల్లా అధ్యక్షుడిగా ఎఎస్ కుమార్, కార్యదర్శిగా కారుమంచి జోజి, ఉపాధ్యక్షులుగా వెంకట్‌కుమార్, సదానంద్, పుల్లయ్యలు, సహాయ కార్యదర్శులుగా ఖాధర్‌బాబు, నందిగామ కృష్ణలతో పాటు 29 మంది జిల్లా కమిటి సభ్యులను ఎన్నుకున్నారు.