ఖమ్మం

హరితహారం అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, జూలై 3: రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం అందరి బాధ్యత అని వైరా ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ అన్నారు. ఆదివారం స్థానిక తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో ఆయన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. అటువంటప్పుడు తప్పనిసరిగా మొక్కలు అందరి బాధ్యతగా అందరి బాధ్యతన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం ఒక మొక్క నాటి దానిని పెంచే బాధ్యత తీసుకుంటే కొన్ని సంవత్సరాల తరువాత మొక్కలు నాటాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రస్తుతం వర్షాలు రాక రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అనంతరం పాఠశాల ఆవరణను కలియతిరిగి చూసి విద్యార్థినిలతో తమ సమస్యలు తెలుసుకున్నారు. వాటి సాధనకు తనవంతు కృషి చేస్తానని విద్యార్థులకు హామి ఇచ్చారు. పాఠశాలలో విద్యార్థినిలతో ఆంగ్లంలో మాట్లాడాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో విద్యార్థినిలు అనర్గలంగా ఆంగ్లంలో మాట్లాడంతో హర్షం వ్యక్తం చేశారు. వంటలు పరిశీలించి వంటలను రుచి చూశారు. విద్యార్థులకు చదువుతోపాటు ప్రభుత్వం మంచి వంటలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఇ సుశీల, ఉపాధ్యాయులు క్రిష్ణారావు, సుదర్శన్, స్వప్న, చంద్రకళ, వైఎస్ ఎంపిపి జ్యోతి, సర్పంచ్ బాణోతు వాలీ, నాయకులు తన్నీరు నాగేశ్వరావు, కారుకొండ బోసు, కౌసర్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.