ఖమ్మం

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూలై 3: పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వెంటనే చెల్లించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదప్రజలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లించకపోవడంతో అసంపూర్తిగా మిగిలి, శిథిలావస్థకు చేరాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మూడు విడతలగా జిల్లాలో 2,69,610 ఇండ్లను మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు 2,15,109ఇండ్లు పూర్తయ్యాయని, మిగతావి పునాది, లెంటల్ లెవల్ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇండ్లకు సంబంధించి బిల్లులు 342కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారన్నారు. ఇండ్లు మంజూరైన లబ్దిదారులు పశువులను అమ్మి, అప్పులుచేసి ఇండ్ల నిర్మాణం చేపట్టారని సరైన సమయంలో బిల్లులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించకుండా సర్వేలు, రిసర్వేలు అంటూ కాలం వెళ్ళబుచ్చుతూ డబల్‌బెడ్‌రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతుందన్నారు. పేదలందరికి డబల్‌బెడ్‌రూం ఇండ్లు అంటూ ఓట్లేయించుకున్న ప్రభుత్వం వద్ద స్పష్టత లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు, డబల్‌బెడ్‌రూం ఇండ్లు తదితర సమస్యలపై తమ పార్టీ ఆధ్వర్యంలో దశలవారి ఆందోళన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 20వరకు గ్రామ, మండల స్థాయిలో ఆందోళనలు, 25వ తేదిన ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు అవరోధం ఏర్పడిందని, న్యాయాధికారులు చేస్తున్న సమ్మెకు గవర్నర్‌తో పాటు ఇరు రాష్ట్రాల సిఎంలు జోక్యం చేసుకొని పరిష్కారం చూపాలన్నారు. అదేవిదంగా అటవీరక్షణ పేరుతో పోడుదారులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను ఆపాలన్నారు. విలేఖరుల సమావేశంలో అఖిలభారత రైతు- కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగయ్య, జిల్లా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, ఆర్ శివలింగం, ఎ అశోక్ పాల్గొన్నారు.