ఖమ్మం

చిరుతపులుల మృతిపై డిఎఫ్‌వో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండ్రుగొండ, జూలై 3: మండల పరిధిలోని అబ్బుగూడెం అడవుల్లో రెండు చిరుతపులులను హతమార్చిన సంఘటనపై కొత్తగూడెం డిఎఫ్‌ఓ శాంతారామ్ ఆదివారం విచారణ చేపట్టారు. అబ్బుగూడెం అడవులలో రెండు చిరుతపులులను హతమార్చిన విషయాన్ని శనివారం రాత్రి ఆంధ్రభూమి వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈకథనంపై స్పందించిన అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డిఎఫ్‌వో ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. చండ్రుగొండ పశువైద్యాధికారి రామ్‌ప్రసాద్‌తో పులుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. పంచనామా సమయంలో పులుల కాళ్ళను నరికిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ సంఘటనపై డిఎఫ్‌వో శాంతారామ్ విలేఖరులతో మాట్లాడుతూ మేకల కాపర్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. విషప్రయోగం వల్లే చిరుతపులులు మృతి చెందినట్లు భావిస్తున్నామని వైద్యుల నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలుంటాయన్నారు. మేకల కాపరులు, పోడు సాగుదారుల వివరాలు అందచేయాలని స్థానిక సిబ్బందిని ఆదేశించామన్నారు. విచారణ వేగవంతం చేసి నిందితులను పట్టుకుంటామని డిఎఫ్‌ఓ వివరించారు.