ఖమ్మం

చిరుత సంచారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జూలై 3: చిరుత సంచరిస్తుందనే అనుమానంతో రఘునాథపాలెం మండలంలోని వి.వెంకటాయపాలెం గ్రామస్థులు ఆదివారం తీవ్ర ఆందోళన చెందారు. గతం వారం రోజులుగా సమీపంలోని పొలాల నుంచి ఓ జంతువు(చిరుత పులి) సంచరిస్తుందనే గ్రామస్థుల్లో ఉంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన శివకృష్ణ అనే వ్యక్తి అది గ్రామంలో నుంచి పొలాల్లోకి వెళ్తున్నట్లు గమనించి గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులు వచ్చే లోగా అది పొలాల్లో నుంచి సమీప మామిడితోటలోకి పారిపోయింది. ఈ క్రమంలో గ్రామస్థులు, అక్కడి నాయకులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కాలిముద్రలను సేకరించారు.వాటి ఆధారంగా హైనా జంతువుగా గుర్తించి, గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని డివిజనల్ ఫారెస్ట్ అధికారి హిర్మర్ సూచించారు.
రాత్రి వేళల్లో అరుపులు : రాత్రివేళల్లో గ్రామంలోకి అడవి జంతువులు వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా రాత్రి, తెల్లవారుజామున సమయాల్లో జంతువుల అరుపులు దడ పుట్టిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. కాగా జంతువులు గ్రామ సమీపంలోని బావులు, చెరువు వద్ద నుంచి కోళ్ళఫారం మీదుగా గ్రామంలోకి వస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలి
గ్రామంలోకి చిరుత లాంటి జంతువులు వస్తున్నాయనే అనుమానంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని డివిజనల్ ఫారెస్ట్ అధికారి హిర్మర్ అన్నారు. ఆదివారం వివిపాలెం గ్రామంలోని అడవి జంతువులు సంచరిస్తున్న సమాచారంపై గ్రామాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ ఏమైనా అనుమానం వస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. గ్రామస్థులు రాత్రి వేళల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో తల్లాడ ఎఫ్‌ఆర్‌ఓ రాముడు, వైరా సెక్షన్ ఆఫీసర్ ముత్యాలరావు, బీట్ ఆఫీసర్లు రమేష్, అమర్‌సింగ్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు కిషన్, సోషల్ ఫారెస్ట్ ఆఫీసర్ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు