ఖమ్మం

అంతా అనుకున్నట్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 3: అంతా ఊహిస్తున్నట్లుగానే, పోరాటాలకు సంబంధం లేకుండానే జిల్లాల విభజనపై కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ తుది నివేదికను అందించనున్నారు. జిల్లా కేంద్రాల కోసం అనేక చోట్ల ఆందోళనలు జరుగుతున్నా, ఒకే నియోజకవర్గంలోని మండలాలు వివిధ జిల్లాల పరిధిలోకి వెళ్తున్నా, అవేవి ప్రజా సౌలభ్యం కోసం కాదని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేసినట్లుగానే విభజన ప్రక్రియ చివరి దశకు చేరింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా 41 మండలాల పరిధిలో ఉండగా మరో 7 కొత్త మండలాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆయా జిల్లా కేంద్రాలకు దగ్గరగా ఉండే వాటిని ఆ జిల్లాల పరిధిలోకే తీసుకరానున్నారు. చివరి నివేదిక ప్రకారం ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం, వైరా, పాలేరు, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలు పూర్తిగా ఉండనుండగా, ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలం కూడా ఖమ్మం పరిధిలోకే రానున్నది. కొత్తగూడెం జిల్లా పరిధిలో కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాలు ఉండనుండగా ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాలు కొత్తగూడెం పరిధిలోకి రానున్నాయి. కాగా ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం, గార్ల మండలాలు మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వెళ్ళనున్నాయి.
ఇదిలా ఉండగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందే కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఖమ్మం జిల్లా పరిధిలో మూడు, కొత్తగూడెం జిల్లా పరిధిలో ఐదు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. వీటన్నింటి కోసం యుద్ధప్రాతిపదికన సర్వేలు, సమిక్షలు నిర్వహిస్తున్నారు. మరో వైపు తమ ప్రాంతాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలంటూ గార్ల, బయ్యారం మండలాల్లోనూ, జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఇల్లెందు, భద్రాచలంలోనూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అవేవి పట్టించుకోని అధికారులు, ప్రభుత్వ పెద్దలు ముందుగా అనుకున్నట్లుగానే జిల్లాల విభజనపై సమగ్ర నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రికి అందించనున్నారు.