ఖమ్మం

అక్రమార్కుల చేతిలో హరించుకుపోతున్న అడవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూలై 4: అక్రమార్కుల స్వార్థానికి చిక్కటి అటవీ ప్రాంతం కరిగి పోతోంది. ఇటీవలే దుమ్ముగూడెం మండలంలో కలప లారీని పట్టుకున్న అటవీశాఖాధికారులు ఇంటి దొంగల పాత్రపై విచారణ జరుపుతున్నారు. దుమ్ముగూడెం మండలం పులిగుండాల అటవీ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో 400కు పైగా టేకు చెట్లను నరికినట్లుగా గుర్తించారు. ఈ విచారణ సాగుతున్న తరుణంలోనే తాజాగా సోమవారం భద్రాచలం సబ్ డిఎఫ్‌ఓ ఇదే మండలంలోని సీతానగరం నుంచి వస్తున్న లారీని తనిఖీ చేయగా అందులో కలప ఉంది. వెంటనే భద్రాచలం డిఎఫ్‌ఓ కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతున్నారు. ఎంత నిఘాను పటిష్టం చేసినా కలప అక్రమంగా తరలి పోతుండటంతో సిసిఎఫ్ సైతం ఇంటి దొంగల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ లారీని వదిలి వేయాలని సబ్ డిఎఫ్‌ఓపై ఒత్తిళ్లు వచ్చినా ససేమిరా అనడంతో పాటు తమ శాఖలోనే కొందరు అధికారుల తీరును కూడా ఆమె తప్పుబట్టినట్లుగా తెలుస్తోంది. పులిగుండాల అటవీ ప్రాంతంలోని రక్షిత అడవి నుంచి 400కు పైగా చెట్లను నరికినట్లుగా గుర్తించారు. ఆ విచారణలో తమ శాఖలోని అధికారులపై విచారణ జరుగుతుండగానే మరో కలప లారీ పట్టుబడటంతో ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. లోతుగా విచారణ జరపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పులిగుండాల నుంచి 5 లారీలు తరలిపోయినట్లుగా అటవీశాఖాధికారులు గుర్తించి వరంగల్ ప్రాంతంలో విచారణ జరిపారు. ఏకంగా లారీల్లోనే కలపను తరలిస్తుండటంతో అక్రమార్కులకు అటవీశాఖాధికారుల అభయం ఉందని తేలిపోయింది. సబ్ డిఎఫ్‌ఓ తాను పట్టుకున్న లారీ డ్రైవర్‌ను విచారిస్తున్నారు. ప్రస్తుతం పట్టుకున్న కలప ఎక్కడకు వెళ్తోంది? ఎవరి హస్తం ఉంది? తమ శాఖలోని ఎవరి ప్రమేయం ఉంది? అనే దిశగా ఆమె విచారణ జరుపుతున్నారు. అక్రమాన్ని ఏ మాత్రం సహించని సబ్‌డిఎఫ్‌ఓ విచారణ జరుపుతుండటంతో ఇంటిదొంగల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సబ్‌డిఎఫ్‌ఓపై ఇప్పటికే అనేక ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. దీనిపై సబ్‌డిఎఫ్‌ఓ మాట్లాడుతూ తాము విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.