ఖమ్మం

హెల్మెట్ ఉంటేనే ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), జూలై 4: ద్విచక్రవాహనాదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను పోలీస్ అధికారులు పటిష్టంగా అమలు చేస్తుండటంతో ఆర్టీవో కార్యాలయాల్లో అధికారులు హెల్మెట్ ఉంటేనే వాహన రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ద్విచక్రవాహన దారులు అత్యధికులు ప్రమాదాల బారినపడిన సమయంలో హెల్మెట్ లేక తలకు తీవ్రగాయాలై మరణిస్తుండడంతో జిల్లా పోలీస్ అధికారులు ఈ మరణాలను నివారించేందుకు వాహనదారులు హెల్మెట్ వాడేలా నిబంధనలను విధించారు. దీంతో జిల్లాలో ఉన్న ఆర్టీవో కార్యాలయాల్లో ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వాహనదారులు హెల్మెట్ లేకుండా వస్తే రిజిస్ట్రేషన్ చేయవద్దని ఆర్టీవో మోమిన్ అదేశాలు జారీ చేశారు. హెల్మెట్ వాడని వాహనదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాటు హెల్మెట్ ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాలు వంటివి వివరిస్తూ ప్రచారం కల్పించిన పోలీస్ అధికారులు తాజాగా ఉదయం సమయంలో రోడ్లపైకి పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి హెల్మెట్‌లు వాడే వారికి చాక్లెట్ ఇచ్చి ధన్యవాదాలు తెలుపుతూ, హెల్మెట్ వాడని వారికి పూలు ఇచ్చి హెల్మెట్ వాడాలని సూచనలు చేస్తున్నారు. ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో, ప్రధాన ప్రాంతాల్లో పోలీస్‌లు, స్వచ్ఛంద సంస్థలు హెల్మెట్‌లు వాడటాన్ని చూసిన వాహనదారులు హెల్మెట్‌లను ఉపయోగిస్తుండటం విశేషం.