ఖమ్మం

ప్రత్యామ్నాయాన్నిపట్టించుకోని రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 4: ఈ ఏడాది ప్రపంచ మార్కెట్‌లో పత్తికి గిరాకీ ఉండదని, గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదని, ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపాలని ప్రభుత్వం, అధికారులు చెప్పినా రైతులు మాత్రం పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయం పేరుతో ప్రతి ఏడాది సాగు అయ్యే పత్తి విస్తీర్ణం కంటే కనీసం 30శాతమన్నా తగ్గించాలనుకున్న అధికారుల శ్రమ వృధా అయింది. అయితే ఇందుకు అధికారులు పూర్తి స్థాయిలో రైతుల్లో అవగాహన కల్పించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే ప్రత్యామ్నాయ పంటలకు మంచి ధర పలుకుతున్నదనే విషయంపై కూడా రైతుల్లో నమ్మకాన్ని కూడా కల్పించలేకపోయారు. గతేడాది జిల్లాలో 1,62,970 హెక్టార్‌లలో పత్తి విస్తీర్ణం సాగైంది. ఈ ఏడాది దానిని కనీసం 80వేల హెక్టార్లు తగ్గించాలని ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. ఇప్పటి వరకు 90,329 హెక్టార్‌లలో పత్తి మొలకెత్తింది. దాదాపు 60వేల హెక్టార్‌లలో రైతులు ఇంకా పత్తి వేసి ఉన్నారు. దీంతో పత్తి సాగు అయ్యే విస్తీర్ణం గతేడాది కంటే పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. మరో వైపు పత్తికి ప్రత్యామ్నాయంగా అధికారులు చూపించిన పంటలవైపు రైతులు ఆసక్తి కనబరచలేదు. జిల్లాలో పెసర 19వేల హెక్టార్‌లలో, కంది 6వేల హెక్టార్‌లలో సోయాబీన్ 71 హెక్టార్‌లలోనే సాగు చేశారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో పత్తికి బదులు సోయాబీన్ వేయాలని స్వయంగా ఆయనే సూచించినా రైతులు స్పందించకపోవడం గమనార్హం. సోయాబీన్ విత్తనాలను సకాలంలో అందించకపోవడం కూడా ఇందుకోకారణంగా చెప్తున్నారు. ఇదిలా ఉండగా గతేడాది కంటే పెసర, కంది సాగు కొంతమేరకు పెరిగినా ఆశించిన స్థాయిలో మాత్రం పెరగలేదు.
ఇదిలా ఉండగా పత్తికి ప్రత్యామ్నాయంగా వేరే పంటపై ఆసక్తి చూపని రైతులు ఇతర పంటల నుంచి మాత్రం మిర్చి వైపు మొగ్గు చూపుతున్నారు. మిర్చి విత్తనాల ధర కిలో లక్ష రూపాయల వరకు పలుకుతున్నప్పటికీ వెనుకాడకుండా ఆ పంట ద్వారానే లబ్ధి పొందవచ్చని నమ్ముతూ దాని కోసం పొలాలను చదును చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఉన్నట్లుగా మిర్చి ధర ఉంటుందని నమ్మకం లేదని, అపరాలను సాగు చేయాలని అధికారులు చెప్తున్నా స్పందించేవారు కరువయ్యారు. దీనిపై రాష్ట్ర స్థాయిలో అధికారులపై ఒత్తిడి పెరుగుతున్నా తామేమి చేయలేమని వారు వ్యవహరిస్తుండడం కొసమెరుపు.