ఖమ్మం

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి/ఖమ్మం(కల్చరల్)/ఖమ్మం(ఖిల్లా) జూలై 4: ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం నగరంలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయ. వివరాల్లోకి వెళితే ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని, పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జాగర్లమూడి రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఏఐఎస్‌ఎఫ్ నేతలకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆందోళన ఉధృతమవుతుందనే విషయాన్ని గమనించి పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 25శాతం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అనేక పాఠశాలల్లో 50శాతం వరకు పాఠ్య పుస్తకాలు పంపిణీ జరగకపోవటం దారుణమన్నారు. వర్షాలు కురుస్తున్నందున జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, తక్షణమే హాస్టల్స్‌లో హెల్త్‌క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, రమేష్, విజయ్, బగ్ధార్, గోపిరెడ్డి, హన్మంత్, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.
ఏబివిపి ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం ఎదుట ధర్నా
అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబివిపి నగర శాఖ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నగర సంఘటన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు, డొనేషన్, ఇతర ఫీజుల పేరుతో ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అనంతరం కార్యాలయం అధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నవీన్, విశాల్, ఈశ్వర్, మోహన్, పృథ్వీ, రవితేజ, శ్యామ్, మధు పాల్గొన్నారు.