ఖమ్మం

పోడు కోసం పోరుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్రంపూర్, జూలై 4: గిరిపుత్రులు పుడమితల్లి కోసం పోరుబాట పట్టారు. పొట్టకూటి కోసం పోడు చేసుకుంటున్న అమాయక ఆదివాసీల పట్ల రాష్ట్రప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకుని సాగుచేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు పాశవిక దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆదివాసీలపై అక్రమంగా కేసులు పెట్టడంతోవారు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే అదనుగా కొందరు అధికారులు ముడుపులు ఇవ్వాలంటూ తమను పీడిస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ దాడులతో అడవి బిడ్డలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల దాడులతో ఆశ్రయాన్ని కోల్పోయి ఆకలితో అలమటిస్తూ కన్నీళ్ళతో కడుపునింపుకుంటున్నారు. మూలవాసుల భూములకు పట్టాలు మంజూరు చేయకుండా కెసిఆర్ సర్ ‘కారు’ కుట్రపన్నుతోందనడానికి ఇటీవల పోడుసాగుదారులపై జరుగుతున్న ఫారెస్ట్ అధికారుల ధాడులే ఇందుకు నిదర్శణమని వామపక్షనేతలు ఆరోపిస్తున్నారు. అడవులు అంతరించకుండా, ఆక్రమణలను అడ్డుకునేందుకే ఈ దాడులు చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. పోడుభూములకు 2008 నుండి పట్టాలు మంజూరు చేయడం జరిగిందని, 2008 సంవత్సరం తరువాత నుండే పోడుసాగు మరింతగా పెరిగిందని ఫారెస్ట్ సర్వేలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లాలలోని ఐదు ఫారెస్ట్ డివిజన్‌లలో ఖమ్మం, భద్రాచలంలోని రెండుడివిజన్‌లు, పాల్వంచ డివిజన్‌లతోపోలిస్తే కొత్తగూడెం డివిజన్‌లోనే అధికంగా పోడుసాగుదారులువున్నారు. జిల్లాలో సుమారు రెండులక్షల ఎకరాలకుపైగా పోడుసాగు జరుగుతుందని ఫారెస్టు అధికారులు అంచనావేస్తున్నారు.ప్రభుత్వాలు వాగ్దానాలతో ప్రజలను వంచిస్తూ ఓటుబ్యాంకుల్లా మలుచుకొంటూన్నాయని గిరిజన సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రజలకు అండగానిలవాల్సిన పాలకులు తమస్వప్రయోజనాలకే పెద్దపీటవేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తూ కాలుష్యాన్ని వెదజల్లే కార్పొరేట్ వ్యవస్థలకు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతూ ఎకరాల కొద్దీ భూములను కట్టపెడుతూ పేదవాడి పొట్టకొడుతోందని కమ్యూనిష్టు పార్టీలు దుయ్యబడుతున్నాయి. పోడుభూములను కాపాడుకునేందుకు అడవిబిడ్డలు పొట్ట చేతబట్టుకుని పోరుబాట పట్టారు.