ఖమ్మం

న్యూవిజన్ పాఠశాల ముందు ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్): పలు రకాల కానె్సప్ట్‌ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై టిపిఇఆర్‌ఎం, కెడిపిఎ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం స్థానిక న్యూవిజన్ పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా దాదాపు 5 గంటల పాటు సాగింది. ధర్నాలో అధిక ఫీజులను అరికట్టాలని, స్కూల్ ఆవరణలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, షూస్, సాక్స్, బెల్ట్, టై వంటి వాటిని అమ్మి విద్యాలయాన్ని కిరాణ షాపుగా మార్చవద్దని, ఐఐటి, మెడికల్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేయవద్దని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని, ఉపాధ్యాయులు వివరాలు, వారి జీతభత్యాల వివరాలతో పాటు, ఫీజుల వివరాలను డిస్‌ప్లేలో ఉంచాలని పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం డిప్యూటి డిఇవో బస్వరాజు, ఎంఇవో శ్రీనివాసరావులు స్కూల్‌ను సందర్శించి ఉద్యమకారులు చేస్తున్న ఆరోపణలను వారు పరిశీలించారు. అనుమతి లేని క్యాంపస్, స్టోర్ రూమ్‌లను అధికారులు సీజ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థుల ఫీజుల వివరాలు, ఉపాధ్యాయుల వివరాలు, వారి జీతభత్యాలను నోటిస్‌బోర్డులో ప్రదర్శించాలని సూచించారు. అనుమతి లేకుండా ఎల్‌కెజి, యుకెజి క్లాసులు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యంపై అధికారులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దయాకర్, టిపిఇఆర్‌ఎం జిల్లా నాయకులు బండారు రమేష్, ఐద్వా జిల్లా అధ్యక్షకార్యదర్శులు మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు టి నాగరాజు, ఎల్ బాలరాజు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు దాసరి నాగేశ్వరరావు, షేక్ బషీరుద్ధీన్, సిపియం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, వై విక్రమ్, జబ్బార్, బి యాకయ్య, మీరా తదితరులు పాల్గొన్నారు.
అధిక ఫీజులను పట్టించుకోని పాలకులు
ఖమ్మం(ఖిల్లా): ప్రైవేటు విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ పాలకులు చోద్యం చూస్తున్నారని ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజులను నియంత్రించాలని సోమవారం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తొలుత జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శనగా మయూరిసెంటర్‌కు చేరుకొని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్స్, కళాశాలలు విద్యార్థుల నుండి ఇష్టానుసారంగా అధిక ఫీజులను వసూలు చేస్తున్నారన్నారు. వాటిని నియంత్రించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయని ప్రైవేటు విద్యా సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సందీప్, శంకర్, నాగరాజు, మహేష్, ఉదయ్, రామరావు, వంశీ, రాజేష్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.