ఖమ్మం

హరితహారంలో విఆర్వోలు కీలకపాత్ర పోషించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జూలై 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో విఆర్వోలు కీలకపాత్ర పోషించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్‌రావు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎనె్నస్పీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విఆర్వోలు హరితహారంలో కీలకపాత్ర పోషించాలని, మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విఆర్వోలు కీలకభూమిక పోషించారని, అదే స్థాయిలో హరితహారంలో కూడా కీలకపాత్ర పోషించి మంచి గుర్తింపును తెచ్చుకోవాలన్నారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విఆర్వోలు సమగ్ర కుటుంబ సర్వే, ఆసరా పెన్షన్లు, ఆహారభద్రత లాంటి 12పథకాలను క్షేత్రస్థాయిలో అమలుకు విఆర్వోలు విశేషంగా కృషి చేశారని, అలాంటి విఆర్వోలు అనేక సమస్యలతో అల్లాడుతున్నారన్నారు. గ్రామరెవెన్యూ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. 600సంవత్సరాల నాటికి సంబంధించిన విధానాలను ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కూడా అమలవుతుండటం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. గ్రామాల్లో విఆర్వోలను ఉండాలనే సూచిస్తున్న ప్రభుత్వం ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో 11,179మంది విఆర్వోల అవసరం ఉండగా 6,732మంది విఆర్వోలు విధులు నిర్వహిస్తున్నారన్నారు. తక్షణమే విఆర్వో పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విఆర్వోలకు గ్రామాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయటంతో పాటు ఫర్నిచర్, స్టేషనరీ సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కోశాధికారి తిప్పర్తి అశోక్, జిల్లా అధ్యక్షులు సున్నం రామారావు, విఆర్వోలు భాస్కర్, నాగేంద్రబాబు, వెంకటేశ్వర్లు, వస్రాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.