ఖమ్మం

తుమ్మల తీరు మార్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూలై 22: ప్రాజెక్టులు, రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళన పట్ల రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల తీరు, రైతు సమస్యలపై తాము చేసిన దీక్ష, ప్రాజెక్టుల పరిశీలనపై తుమ్మల అపహాస్యం చేయడం తగదని, ఆయన హోదాకు సరైంది కాదన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు ఆలోచన లేదనడం సంస్కారం హీనమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తాము ఆందోళనలు జరుపుతుంటే అధికార బలంతో పాలకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు 1070కోట్లు ఇందిరాసాగర్, 600కోట్లు రాజీవ్‌సాగర్ వ్యయంతో 75శాతం పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రీడిజైన్ పేరుతో 10వేల కోట్లను కేటాయిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన నేతల పేర్లు మార్చడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టుకు ఇంధిరా, రాజీవ్ పేర్లు జతచేసి సీతారామా రాజీవ్ ఇంధిరాసాగర్‌గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో జ్వరాలు పట్టి పీడిస్తుంటే జిల్లా మంత్రిగా తుమ్మల ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితం సత్యం, నాయకులు కట్ల రంగారావు, రామమనోహర్‌నాయుడు, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, ఫజల్, బాలాజీరాంనాయక్ పాల్గొన్నారు.