ఖమ్మం

ఏసీబీకి చిక్కిన సర్వేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, ఆగస్టు 4: ఖమ్మం సర్వే ల్యాండ్ రికార్డ్సులో పని చేస్తున్న మురళీ అనే సర్వేయర్ ఏసిబికి చిక్కారు. బోనకల్ మండలం కలకోట గ్రామానికి చెందిన కానూరి గోపీకృష్ణ అనే రైతు తన భూమిని రీ సర్వే చేయాలని మండల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే భూమిని సర్వే చేసే విషయంపై ఖమ్మంలోని సర్వే ల్యాండ్ రికార్డ్సు కార్యాలయంలో కలవాలని కోరటంతో ఆయన ఖమ్మంలో ఆ కార్యాలయంలోని అధికారులను సంప్రదించి రీ సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించిన అధికారులు సర్వే కోసం మురళీని కేటాయించగా, గోపీకృష్ణ మురళీని కలిసి త్వరగా సర్వే పూర్తిచేయాలని కోరారు. దీనిపై మురళీ 10వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయటంతో తాను ఇచ్చుకోలేనని గోపీకృష్ణ విన్నవించుకున్నారు. మురళీ రీ సర్వేకు రాకపోవటంతో పది వేలు ఇస్తానని చెప్పి ఏసిబి అధికారులను ఆశ్రయించారు. అధికారులు పథకం ప్రకారం గోపీకృష్ణ పది వేలు ఇస్తుండగా మురళీని పట్టుకొని అరెస్ట్ చేశారు. మురళీని ఏసిబి అధికారులు రిమాండ్‌కు తరలించారు. కాగా మురళీ అరెస్ట్ కావటంతో కలెక్టరేట్‌లో కలకలం రేగింది. గతంలో కూడా ఓ డిప్యూటీ తహశీల్దార్ డబ్బులు తీసుకుంటుండగా ఏసిబి అధికారులకు చిక్కగా ఇప్పుడు సర్వే ల్యాండ్ రికార్డ్సు సర్వేయర్ ఏసిబికి చిక్కాడు.