ఖమ్మం

టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, ఆగస్టు 30: అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో వచ్చే నెల 2వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ అధ్యక్షులు జిఎస్ ప్రసాద్, నగర అధ్యక్ష, వల్లోజి శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంట్రిబ్యూటరి పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయటంతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రమణయాదవ్, శ్రీనివాస్, సైదులు, గురుమూర్తి, జయపాల్ పాల్గొన్నారు.