ఖమ్మం

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), ఆగస్టు 30: వచ్చే నెల 2వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియు, ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు, టిఆర్‌ఎస్‌కెయు నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, పోటు ప్రసాద్, రామయ్య, కొత్త సీతారాములు వెంకట నారాయణ, పోటు సత్యనారాయణ, కాసాని నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ దేశ రక్షణకు, కార్మికుల రక్షణకు సెప్టెంబర్ 2న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్మిక చట్టాలను సవరించి కార్పొరేటు సంస్థలకు బానిసలను చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందన్నారు. కార్మికుకలకు కనీస వేతనాలు అందించే విషయంలో నోరుమెదపని కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను కాలరాసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలను నియంత్రించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏద్దేవా చేశారు.
కార్మికుల శ్రమతో ఏర్పడిన సంస్థలను విక్రయించే ప్రయత్నాలకు పూనుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీస వేతనాలు, ధరల నియంత్రణ, అసంఘటిత రంగ కార్మికుల రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా, కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికుల రెగ్యులరైజేషన్ కోసం జరిగే సమ్మెలో కార్మికులంతా పాల్గొని సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు నర్సింహారావు, లింగయ్య, విష్ణు, గణపతి, శ్రీకాంత్, శ్రీను, బిజె క్లైమెంట్, సింగు నర్సింహారావు, మర్రి బాబురావు, సిహెచ్.సీతా మహాలక్ష్మీ, సాంబశివారెడ్డి, నున్నా మాధవరావు, విప్లవ్‌కుమార్, సైదులు పాల్గొన్నారు.