ఖమ్మం

ఓసి బొగ్గుగనిలో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, ఆగస్టు 30 : గత రెండేళ్ళ క్రితం సత్తుపల్లి జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ బొగ్గుగనిలో జరిగిన అవినీతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సింగరేణి బొగ్గుగనుల హెచ్‌ఎంఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. మంగళవారం సత్తుపల్లిలో హెచ్‌ఎంఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో షేప్ నిధులు ఖర్చు పెట్టల్సి ఉండగా మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోద్బలంతో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు ఆరు వేల కోట్ల రూపాయలు బకాయి ఉందని, బకాయిని తిరిగి చెల్లించక పోవటంతో సింగరేణి సంస్థ రుణం తీసుకొని పవర్ ప్రాజెక్ట్ కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం దోచుకుంటుదని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడా కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు వ్యవస్థపై అధికారంలో లేనప్పుడు ప్రశ్నించిన టిఆర్‌ఎస్ ఇపుడు అదే బాటలో పయనిస్తుందన్నారు. కొత్తప్రాజెక్టుల ఆటోచన చేయకుండా దక్షిణాఫ్రికా నుంచి బొగ్గు కొనుగోలు చేసి రప్పించేందుకు ప్రణాళిక రచిస్తుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 70 ఏళ్ళ సింగరేణి చరిత్రలో ఇప్పటి వరకు 16శాతం మాత్రమే బొగ్గు తవ్వకాలు చేపట్టారని ఇంకా 84శాతం బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని పేర్కొన్నారు.