జాతీయ వార్తలు

ప్రియుడి ఒత్తిడితో ప్రత్యూషకు అబార్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ‘బాలికా వధు’ (చిన్నారి పెళ్లికూతురు) ఫేమ్ టీవీ నటి ప్రత్యూష ఆత్మహత్యకు సంబంధించి రోజురోజుకూ అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవడానికి ముందే ప్రత్యూష అబార్షన్ చేయించుకుందని విచారణలో తేలింది. పెళ్లి కాకుండానే తన వల్ల గర్భం దాల్చడంతో ప్రత్యూష అబార్షన్ చేయించుకుందని ఆమె ప్రియుడు రాహుల్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. రాహుల్ ఒత్తిడి వల్లే ఆమె అబార్షన్ చేయించుకుందని, అతడి నుంచి ఎదురైన వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని ప్రత్యూష కుటుంబ లాయర్ వాదిస్తున్నారు. అబార్షన్ జరిగినట్లు రాహుల్ అంగీకరించినందున ప్రత్యూష ఆత్మహత్యకు అతని వేధింపులే కారణమని స్పష్టమవుతోందని లాయర్ అంటున్నారు.