శ్రీకాకుళం

జనవరి 29కి లక్ష్మీపేట కేసు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంగర, నవంబర్ 27: మడ్డువలస జలాశయ మిగులు భూములు విషయంలో ఎస్సీ, బిసీ వర్గాల మధ్య చోటుచేసుకున్న కొట్లాట, హత్య సంఘటనలకు సంబంధించి విచారణకు ప్రభుత్వం లక్ష్మీపేట గ్రామంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసింది.
శుక్రవారం 67 మంది నిందితులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సత్యశ్రీ ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం తిరిగి 2016 జనవరి 29 తేదీకి వాయిదా వేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ విచారణ సందర్భంగా సిబిసి ఐడి డిఐజి సుందర్‌కుమార్ దాస్, పాలకొండ డిఎస్పీ ఆదినారాయణ, పలువురు సిఐలు, ఎస్సైలు సహా సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.
త్వరగా లక్ష్మీపేట దోషులను శిక్షించాలి
మండలం లక్ష్మీపేట సంఘటనకు సంబంధించి దోషులను విచారించి త్వరగా శిక్షించాలని ప్రముఖ న్యాయవాది బసవతారకం డిమాండ్ చేశారు. శుక్రవారం లక్ష్మీపేట గ్రామంలో దళితులతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా మాట్లాడారు. ఐదుగురు దళితులు ఈ సంఘటనలో హత్యకు గురైనప్పటికీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ వేగవంతంగా జరగటం లేదన్నారు. నిందితులు కూడా పూర్తిస్థాయిలో హాజరుకావడంలేదని, హాజరుకాని వారిపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోరారు. విచారణ వేగవంతం చేయాలని, పూర్తిస్థాయిలో బాధ్యతలు తరుపున న్యాయవాదులను నియమించాలని కోరారు. ప్రత్యేక కోర్టుకు సంబంధించి న్యాయమూర్తి, సిబ్బందికి క్వార్టర్స్ ఏర్పాటు చేస్తే విచారణ వేగవంతమవుతుందన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయనతోపాటు న్యాయవాదులు శశిభూషణరావు, శ్రీమన్నారాయణ, వీరభద్రం, కృష్ణయ్య, పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు.
ఓటర్ల తుది జాబితాకు
జనవరి 11 చివరి గడువు
శ్రీకాకుళం, నవంబర్ 27: తుది ఓటర్ల జాబితాను 2016, జనవరి 11 నాటికి సిద్ధం చేయాలని, అదేవిధంగా షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో శుక్రవారం ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటర్ల నమోదులో ఏ ఒక్క ఓటరు కూడా డూప్లికేటు కాకుండా చూడాలని, కొత్తగా నమోదు చేసుకోవలసిన ఓటర్లు, తీసివేయాల్సిన ఓటర్ల వివరాలను కూడా సిద్ధం చేయాలన్నారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉన్నట్లయితే వచ్చే నెల 15లోగా తెలియజేయాలని, అలాగే, డాటాబేస్, ఫోటోలు అప్‌లోడింగ్, సప్లమెంటరీ జాబితాలను డిసెంబర్ 31 నాటికి సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. 2016 జనవరి 11 నాటికి తుది జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లను సూచించారు. కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలు, తీసివేసిన ఓటర్ల వివరాలను ప్రతీ సోమవారం రోజున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని, ఇందుకు ఈ.ఆర్.వో.లు బాధ్యత వహించాలని అన్నారు. ఓటర్ల జాబితా శతశాతం లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరచేందుకు ప్రత్యేకంగా మోనటరింగ్ అధికారిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సిబ్బందికి చెల్లించవలసిన పారితోషికం, ఇతరత్రా చెల్లింపులు ఏమైనా ఉంటే వాటి వివరాలను తక్షణమే అందజేయాలని వాటిని ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జిల్లాల వారీగా సమీక్షించారు. జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు మాట్లాడుతూ 1167 మంది దరఖాస్తులు పరిశీలంచవలసి ఉందని చెప్పారు. అదేవిధంగా జిల్లాలో 60 వేల మంది వరకు డూప్లికేటు ఓటర్లు ఉన్నారని, వాటిలో ఆరు వేల ఓటర్లను తొలగించామని, మిగిలిన వాటిని ఈఆర్‌వోల ద్వారా మాసాంతంలోగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఎన్నికల సిబ్బందికి చెల్లించాల్సిన పారితోషకం వివరాల నివేదికను అందించినట్టు పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో దయానిధి, ఎన్నికల విభాగం డెప్యూటీ తహశీల్దార్ బి.రాజేశ్వరరావు, జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల డెప్యూటీ తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.