ఉత్తరాయణం

నిస్వార్థ నాయకులు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వచ్ఛ్భారత్’ ఆశయం తప్పక నెరవేరుతుంది. ప్రధానమంత్రి కల - చెదిరిపోదు - కాని పెద్దలు చాలా మంది వారి అభిప్రాయంలో ఒకరు దానికి ప్రణాళిక కావాలి, ప్రచారం మాత్రమే చాలదని, మరొకరు ఆర్భాటమని, ఇంకొకరు ఆరాటమని వెలిబుచ్చారు. అందరూ తమ అభిప్రాయాలలో ‘స్వచ్ఛత’కు వ్యతిరేకులు కారని గమనించాలి. మనం కొంతకాలం వెనుకకు చూస్తే గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో ప్రతివారు తమ ఇంటి ఆవరణను, ఇంటిని శుభ్రం చేసి తమ ఇంటి ఎదురుగానున్న రహదారులు శుభ్రంచేసే వారు. శుభ్రం చేసిన తరువాత వచ్చిన వృధాను వాటికి ప్రత్యేకించిన ఖాళీ స్థలంలో నిలువచేసేవారు పల్లెవాసులు. పట్టణాలలో, నగరాలలో అందుబాటులో ఉన్న డస్ట్‌బిన్‌లో వేసేవారు. అది వారు నిర్ణయించుకున్న డంపింగ్ యార్డ్‌కు చేరవేసేవారు. ఆ చెత్త కొన్ని నెలలో సేంద్రియ ఎరువుగా మారేది. దానిని పల్లెలలో వ్యవసాయ భూములలో ఎరువుగా ఉపయోగించేవారు. నగరాలలో కూడా దానిని వేరేగా ఉపయోగించేవారు. అందువలన పరిసరాలు పరిశుభ్రంగా, స్వచ్ఛందంగా ఉండేవి.
రానురాను ఆ వ్యవస్థ నిర్లక్ష్యం చేయిబడింది. అందువలన ప్రతిచోట పరిశుభ్రత పోయి ‘స్వచ్ఛ’త లోపించింది. తిరిగి ప్రభుత్వాలు కళ్ళు తెరచి ఆ వ్యవస్థను గాడిలో పెట్టి లోటుపాట్లను సవరించి అవసరమైన సిబ్బందిని అదనంగా కల్పించి సరైన దారిలో నడిపించేందుకు ప్రతిన తీసుకోవాలి. ప్రజాప్రతినిధులకు బాధ్యత నీయరాదు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ బాధ్యతలను సరిగా నిర్వర్తించగలరు.
ఈనాడు ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం సంపాదనకే విలువనిస్తున్నారు. కానీ వారు నిస్వార్థంగా ఉంటే గ్రామాలు ఎంతో బాగుంటాయ. ఉదాహరణకి ఎమ్మెల్యేగా స్ర్తి ఎన్నికైతే ఆమె భర్త అధికారం చలాయించరాదు. ఎంపిటిసి, జెడ్పీటిసి పోస్టులు రద్దుచేస్తే మంచిదేమో ఆలోచించాలి. పంచాగయతీ వ్యవస్థలో కూడా మార్పు రావాలి. పంచాయతీలో రోడ్లు వగైరా వేయడానికి పంచాయతీ సభ్యుల అనుచరులకు అనుమతి ఇవ్వరాదు. అలా ఇస్తున్నందువలననే అవినీతి. అలాగే ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ మంత్రుల అనుచరులకు కాంట్రాక్టులు ఇవ్వరాదు. ఇవన్నీ అమలుజరిపే ప్రభుత్వాలు వుండే రోజు రావాలి. మోదీ ప్రధానమంత్రిగా కొనసాగితే అలాంటి ప్రభుత్వం తీసుకొని రాగలరని ఆశిద్దాం. మనకు ఉన్న పార్టీలలో అన్నింటిలో మొదటి, రెండవ తరం నాయకులు ఆదర్శనీయులు. వారికి ఆదర్శమే ముఖ్యం. ఈనాటి చాలామంది నాయకుల్లా పార్టీలు మార్చేవారు కాదు. అలాంటి నాయకుల కొరకు ప్రజలు భగవంతుని ఆరాధించాలి. అంతకంటే మార్గం లేదు. ఆనాడే స్వచ్ఛ్భారత్ కాగలదు.
-డి.పి.రామచంద్ర రావు, కానూరు, కృష్ణా జిల్లా
స్వచ్ఛ్భారత్ సాధ్యం కావాలంటే...
ప్రభుత్వం ఆదాయం పన్ను చెల్లించే వారి నుండి విద్యా సెస్ కింద 2.5 శాతం ముక్కుపిండి వసూలు చేస్తున్నది. అయనప్పటికే ఏ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏమాత్రం మెరుగు కాలేదు. విద్య, నిరక్షరాస్యతా నిర్మూలన అంశా ల్లో తన పనితీరు బాగాలేదు కాబట్టే ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ, నిరుపేద మైనారిటీ వర్గాల వారికి కేటాయంచా లని నిబంధన విధించింది. అంటే దీనర్ధం ఏమిటంటే, ప్రభుత్వం ప్రజలవద్ద నుంచి డబ్బును వసూలు చేస్తున్నది, బాధ్యతను మాత్రం ప్రైవేటు విద్యా సంస్థలపైకి నెట్టేస్తోంది.
ఇప్పుడు స్వచ్ఛ్భారత్ సెస్‌ను విధిస్తోంది. ప్రజల జేబులకు చిల్లిపెట్టే మరో యత్నమన్నమాట ఇది. ఈ నిధులు మాత్రం సక్రమంగా వినియోగమవుతాయన్న నమ్మకం ఏమిటి? ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై తమ పరిసరాలను పరిశుభ్రం చేసుకునే వివేచన పెంచుకుంటేనే స్వచ్ఛ్భారత్ సాధ్యం. పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచ డం ఒక నేరమన్న భావన ప్రజల్లో కలగాలి. అంతేకాదు పాఠశాలలు, గృహాలు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా స్వచ్ఛ్భారత్ పరిధిలోకి తీసుకొని రావాలి. అప్పుడే స్వచ్ఛ్భారత్ లక్ష్యం నెరవేరుతుంది. కేవలం 0.5 శాతం సెస్ విధించడం వల్ల కాదు
- త్రిపురనేని హనుమాన్ చౌదరి, సికింద్రాబాద్

హిందువులంటే చులకనా?
దీపావళి టపాసులు వల్లే దేశంలో కాలుష్యం మాత్రమే కాక, ‘ఓజోన్’ కూడా క్షీణించి పోతున్నదని దీపా వళి పండుగరోజు వ్యాసంలో రాజుగారు ఆందోళన పడ్డా రు. నిజానికి దేశంలో రోజువారీ కాలుష్యంతో పోల్చితే దీపావళి కాలుష్యం లెక్కలోనిది కాదు. వివిధ కంపెనీల కాలుష్యాన్ని పరిగణించని వారు దీపావళి కాలుష్యాన్ని భూతద్దంలో చూపడం హ్రస్వ దృష్టికి నిదర్శనం. విదేశీ బాణాసంచా వల్లే కాలుష్యం. గతంలో వలె కాలుష్య రహిత స్వదేశీ బాణా సంచా తయారీని ప్రోత్సహించి దీపావళిని విశ్వపం డుగగా చేయాలి. రోజువారీ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసే ధైర్యం లేనివారు దీపావళి, వినాయక చవితిల వల్లే అధిక కాలుష్యం వస్తోందనడం హిందువులను చులకన చేయ డమే. నిజానికి దీపావళి తర్వాత కొన్ని రోజులపాటు దోమల బెడద ఉండటం లేదు. దీనికి బాణసంచా కారణం కాదా? ప్రతి రోజు ట్రాఫిక్‌లో 120 డెసిబెల్స్‌కు మించిన శబ్దాల వింటు న్నాం. ప్రతివారం 150 డిబికి మించిన ప్రార్థనా కాలుష్యంతో మైకుల ద్వారా ప్రసారం చేస్తూ గంటలకొద్దీ వేలమందిని వేధిస్తున్న వార్ని విజ్ఞులు ఎందుకు నిల దీయరు?ఎందుకంటే వారు సెక్యులరిస్టులు. శివకాశిలో మాత్రమే బాలకార్మికులు లేరు. మన చుట్టూ ఇళ్లలో, హోటళ్లలో పనిచేస్తున్న బాలలను రక్షిస్తే, శివకాశిలో వారిని గురించి తర్వాత ఆలోచించవచ్చు. డిసెంబరు 31 అర్థరాత్రి కాల్చే బాణసంచాపై వీరెందుకు మాట్లాడరు?
-పి.ఆర్.వి.ఎస్. ఆచార్యులు, విశాఖపట్టణం