ఉత్తరాయణం

డిఏ చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2015 డిశంబరు నాటికి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు రెండు విడతల డిఎ వాయదాలు ఇవ్వవలసి ఉన్నది. డిఎ ఇవ్వనందువల్ల ముఖ్యంగా పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి పెన్షనర్ల ఇబ్బందులను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారు రిటైరై ఉన్నారు కదా. డిఎ విడుదలకు ఏడాది కాలం ఎందుకు పట్టిందో అర్థం కాదు. రాష్ట్ర విభజన కారణమా? ఆర్థిక దుస్థితి కారణమా? పోనీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనుకుంటే ప్రభుత్వం చేస్తున్న అనవసర వ్యయం ఆగిపోలేదు. దుబారా ఖర్చు అధికంగా ఉంది. ఈ డబ్బు అంతా ప్రభుత్వం ప్రజల వద్దనుంచి వసూలు చేసేదే. ఐతే ఈ ఖర్చు ప్రభావం ఉద్యోగుల డిఎపై పడింది. ఆమధ్య ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆదాయంలో ఉద్యోగుల ఖర్చు 23 శాతమని! కానీ ఆ ఖర్చులో ఆయన గారి జీతం కూడా ఉన్నదన్న విషయం తెలుసుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు రాయతీ భోజనం, కారు ఖర్చులు, టీఏ, డీఏలు, ఉచిత వసతి ఖర్చు, ఫోన్‌బిల్లులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కలిసి ఉన్నది. అసలు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ జీతం అవసరమా? వీరివద్ద కుప్పలు తెప్పలుగా డబ్బు ఉన్నది. అందువల్ల వీరు తమ జీతాలను త్యాగం చేసి విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలి. అప్పుడు ప్రజలు వచ్చే ఐదేళ్లు మిమ్మల్నే ఎన్నుకుంటారు. రిటైరైన వారికి రెండు విడతల డిఎ ఇప్పించండి.
- డి. దశరధయ్య, కొత్తగూడెం
అభినందన చందనం
జెఎన్‌యులో జరిగిన ఘటన అసలు స్వరూపాన్ని ఎంవిఆర్ శాస్ర్తీగారు చాలా స్పష్టంగా ధైర్యంగా వెల్లడిం చారు. వారికి అభినందన పూర్వక నమస్కారాలు. ఈ విషయంలో అసలు స్వరూపాన్ని చూపకపోవడం, చిన్నది చేసి చూపడం, సమర్థించడం చాలా చోట్ల జరుగుతున్న పని. ఇది చాలా బాధాకరం. ఒక వ్యక్తినో, ఒక పార్టీనో కాక, మొత్తం పార్లమెంటును మట్టుపెట్టడానికి కుట్ర పన్నిన వారిని బహిరంగంగా సమర్థించడం, ఇండియా డౌన్‌డౌన్, పాకిస్తాన్ జిందాబాద్ ‘కాశ్మీర్‌కు స్వాతంత్య్రం వచ్చేదాకా యుద్ధం జరుగుతుంది’ అని ప్రేలిన దేశ ద్రోహులను భారత దేశ రాజధానిలో కొన్ని ప్రధాన పక్షాలు, నాయకులు, వివేకంతో ఆలోచించవలసిన విశ్వ విద్యాలయ విద్యర్థులు సమర్థిస్తున్నారంటే గుండెలు మండిపోతున్నాయ.
బంగ్లాదేశ్‌లో ఒక హిందూ దేవాలయం ప్రధాన పూజా రిని నిష్కారణంగా గొంతు కోసి, మేమే దారుణం చేశామని గర్వంగా ఐఎస్ వారు చెప్పుకొంటున్నారు. వారు బయట శత్రువులు. ఇక దేశంలో విశ్వవిద్యాలయాలలో విద్యార్థులలో ఇలా జాతి ద్రోహావేశం ఉంటే దానిని లోగ డ దేశానే్నలినవారు ఇప్పుడు ఏలుతున్న వారు సమర్థిస్తుం టే దేశం గతి ఏమిటి? దీన్ని తక్షణమే అరికట్టాలి.
- డాక్టర్, చిర్రావూరి శివరామకృష్ణ, హైదరాబాద్
రైల్వే బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం
ఇటీవలి రైల్వే బడ్జెట్‌ను చూస్తే ఏపీకి ఎంత చక్కగా మొండి చెయ్య చూపారో అర్థమవుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్ రేల్వే మంత్రిగా ఉన్నప్పుడు బిహార్‌ను, మమత ఆధ్వర్యంలో బెంగాల్‌ని రైల్వే పరంగా అభివృద్ధి చేసుకు న్నది విదితమే. ఆదాయం ఇవ్వడం మీ వంతు, అసౌకర్యా లు కల్పించడం మావంతు అన్న చందంగా ఉందీ రైల్వే బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం ఏపీ పట్ల అనుసరిస్తున్న సవతి తల్లి ప్రేమకు ఇది నిదర్శనం. సురేష్ ప్రభు ఒక్కసారి ఫలక్ నామ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ కంపార్ట్‌మెంట్‌లో రహస్యంగా ప్రయాణిస్తే ఏపీ నుంచి ఆదాయం ఎట్లా వస్తున్నది అర్థమవుతుంది. దారుణమైన విభజన పుణ్యమాని ఆంధ్ర ప్రదేశ్ తీవ్రంగా నష్టపోయంది. కేంద్రం కూడా సహాయ సహకారాలను అందిస్తామని అప్పట్లో పేర్కొంది. కానీ కొత్త రాష్ట్రానికి ఇచ్చే చేయూత ఇదేనా?
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం
ఆంధ్రులకు ఎప్పుడూ అన్యాయమే
రైల్వే బడ్జెట్‌లో కేంద్రం కేవలం తక్కువ నిధులు కేటా యస్తే భాజపా/టిడిపిలు సంబరాలు జరుపుకోవడం దారుణం. విశాఖ రైల్వేజోన్ ప్రసక్తే లేదు. కనీసం దీనె్నవరూ పట్టించుకన్న పాపానపోలేదు. పార్టీలకతీతం గా మన తెలుగు ఎంపీలు వాళ్ల కాంట్రాక్టు వ్యాపారాలకి, రాయతీలు మాత్రమే అడుగుతారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కొత్త రైళ్లను తీసుకొని రాలేరు, న్యాయబద్ధమైన కోర్కెలను కూడా పార్లమెంటులో ప్రస్తావించడానికి వీరికి నోరు రా దు. మనల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏం చేశామన్నదా నికంటే, ఎన్ని కాంట్రాక్టులు తెచ్చుకున్నాం? ఎంత లాభం వచ్చింది అని మాత్రమే లెక్కలు వేసుకుంటారు. ఇటువం టి నాయకులుండం తెలుగువారి ఖర్మ కాకపోతే మరేం టి?
- వై.ఎస్. గిరిబాబు, ధవళేశ్వరం