ఉత్తరాయణం

తుళ్లూరులో ట్రాఫిక్ బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలను రాజధాని ప్రాంతాలుగా ప్రకటించడంతో ఈ ప్రదేశాలలో ఒక్కసారిగా భూములకు రెక్కలొచ్చాయ. కార్పొరేట్ సంస్థలు,పారిశ్రామిక వేత్తలు, రియల్టర్లు ఇక్కడ గ్రామస్థుల నుండి నయానో, భయానో భూములను కొనడానికి యత్నిస్తున్నారు. అమ్మడానికి ఇష్టపడని రైతులపై ఏదోరకంగా వత్తిళ్లూ తెస్తున్నారు. ప్రభుత్వం నుండి మద్దతు లభించని కారణంగా అన్నదాతలు కొంపా గోడూ సర్దుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. రాష్ట్రంలోని ప్రముఖులంతా ఇక్కడే క్యాంపులు ఉండటంతో రద్దీ బాగా ఎక్కువైంది. తుళ్లూరులోని లైబ్రరీ సెంటర్, మందడం, తాడెపల్లిలోని ఉండవల్లి సెంటర్లలో రోడ్డు దాటాలంటే పడే అవస్థ అంతా ఇంతా కాదు. వేగంగా దూసుకెళ్లే వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువై అనేక మంది మృత్యువాత పడుతున్నారు. రాయపూడి-తుళ్లూరు మద్య వడ్డగిరి దగ్గరినుంచి అమరావతి వైపునకు వెళ్లేందుకు కొత్తగా బైపాస్ రోడ్డు నిర్మించారు. దీంతో వాహనాల మళ్లింపుతో తుళ్లూరులో ట్రాఫిక్ కష్టాలు తొలగుతాయని అందరూ భావించారు. కానీ అలా జరగకపోగా, తీవ్రమయ్యాయని ప్రయాణి కులతో పాటు స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున నారు. విజయవాడ, అమరావతి వైపు నుంచి రాకపోకలు సాగించే లారీలను, వాహనాలను తుళ్లూరు వద్ద నుంచి దారి మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు.
-ఎం. కనకదుర్గ, ముత్తంశెట్టి పాలెం, తెనాలి

క్రీడల ప్రాధాన్యత పెంచాలి
చాలా పాఠశాలల్లో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఉండటం లేదు. పి.ఇ.టి పోస్టులు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఉండేలా చూడాలి. ప్రతి తరగతికి ఆటలకు తగిన ప్రాధాన్యతనివ్వాలి. ఆటలకూ, వ్యాయామానికి ప్రతి తరగతికీ తప్పనిసరిగా ఒక పీరియడ్ కేటాయించడమేగాక ప్రతిరోజు అవి కొనసాగేలా చూడాలి. ధ్యానానికీ తగిన ప్రాధాన్యతనివ్వాలి. అయితే రెగ్యులర్‌గా ఆడించే కబడ్డీ, ఖోఖో వంటి ఆటలేగాక టీ.వి.లు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, క్రికెట్ మూలంగా అంతరించిపోయిన వివిధ గ్రామీణ క్రీడలను విద్యార్థులచే ఆడించాలి. ఆట పాటలతో కూడిన విద్యే విద్యార్థుల మానసిక వికాసానికి దోహదం చేస్తాయని గ్రహించాలి. కాని దురదృష్టవశాత్తు దీన్ని దాదాపు ఏ పాఠశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఈ స్థితిలో మార్పు రావాలి.
- సరికొండ శ్రీనివాసరావు, హైదరాబాద్

పేదలకు సహాయం చేయండి
అన్ని కులాలవారు రిజర్వేషన్లకోసం ఆందోళన చేయకుండా తమ కులంలోని నిరుపేదలకు సహాయంచేస్తే బావుంటుంది. బాగాఉన్నవారు తమ కులంలో ఆర్థికంగా వెనకబడిన వారికి విద్యావ్యాపార విషయాల్లో సహాయం చేయాలి. ఒక సాంఘిక సంక్షేమ సంఘం స్థాపించి ఆ సంస్థ ద్వారా పేదలకు ఉచిత విద్య అందించవచ్చు. వ్యాపారాలకి పెట్టుబడి ఇవ్వవచ్చు. అప్పుడే తమ కులంలోని అన్ని తరగతులవారు సమానంగా పైకి వచ్చే అవకాశం వుంటుంది. పైగా రిజర్వేషన్లకోసం ఆందోళనలు చేసే అవసరం వుండదు కూడా! ఆవిధంగా చేయడం వల్ల సాటివారిని ఆదుకున్నట్లవుతుంది. పెదలకు సహాయం చేసినట్లవుతుంది.
- శాంతమూర్తి, హైదరాబాదు