ఉత్తరాయణం

నిబంధనలు అతిక్రమిస్తున్న ఆటోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్టీసి బస్సులు సమయానికి రాకపోవడం, వచ్చినా కిక్కిరిసి ఉండడం, మరి కొన్నిచోట్ల బస్సు సౌకర్యాలు లేకపోవడం వలన చాలామంది ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఈ అవకాశాన్ని కొంతమంది ఆటోడ్రైవర్లు సొమ్ముచేసుకుంటున్నారు. కాలం చెల్లిన ఆటోలను ఫిట్‌నెస్, పొల్యూషన్ సర్ట్ఫికెట్లు కూడా లేకుండా, పరిమితికి మించి ఎక్కించుకుంటూ, ఓవర్ స్పీడుతో నడుపుతూ, ట్రాఫిక్ రూల్స్‌ను ఇష్టం వచ్చినట్లు బ్రేక్ చేస్తూ అనేక ప్రమాదాలకు కారణవౌతున్నారు. నేను చెప్పిందే రూలు, నాకింకొకరు రూలు చెప్పేదేమిటి? నా ఆటో, నా రోడ్డు, నా ఇష్టం అన్న విధం గా ఇష్టారాజ్యంగా ఆటోనడుపుతూ అనేక మంది ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నారు. హెల్మెట్ లేకపోతే బండి ఆపి వెయ్యి రూపాయలు ఫైన్‌వేసే రవాణాశాఖకు ఆటోవాలాల ఆగడాలు, నిబంధనల అతిక్రమణలు ఎందుకు కనిపించడం లేదు?
- ఎం.కనకదుర్గ, తెనాలి
పాలనపై దృష్టి పెట్టండి
అధికారంకోసం కల్లబొల్లి హామీలు గుప్పించడం గెలిచాక కుంటిసాకులు వెతకడం తెలుగుదేశం పార్టీకి కొత్తకాదు! ఎన్నికల ముందు మొత్తం అన్ని రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని, ధరలు నియంత్రిస్తామని, ఆడవారికి రక్షణ కల్పిస్తామని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని, బిసిలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి, గెలిచాక చుక్కలు చూపిస్తున్నారు. లక్ష కోట్లు తిన్నాడని జగన్‌ని విమర్శించే బదులు అధికార పార్టీ దానిని నిరూపించి స్వాధీనం చేసుకుని హామీలు అమలుచేయవచ్చుకదా! కాంగ్రెస్ పార్టీ అవినీతితో కుళ్లుకంపుకొడుతోందని అధికారంలోకి రాగానే కడిగేస్తానని ప్రగల్భాలు పలికి 70 శాతం కాంగ్రెస్ కుళ్లు కంపు నాయకులను తన పార్టీలో కలిపేసుకున్న చంద్రబాబు పార్టీ రెట్టింపు కుళ్లు కంపుకొడుతోంది. తన ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలని ఆడిపోసుకోవడం మాని పాలనపై దృష్టిపెట్టాలి!
- చర్ల మల్లేశ్వరరావు, కాకరపర్రు
అనవసర వివాదం
ఈమధ్య కేరళలోని అయ్యప్ప దేవాలయంలోనికి ఆడవారి ప్రవేశానికి అర్హత ఎందుకు కలగజేయట్లేదని సుప్రీంకోర్టు వివాదానికి తెర తీసింది. అయ్యప్ప బ్రహ్మచారి. రజస్వల కాని వారు, నెలసరి ఆగిన స్ర్తిలు మాత్రమే ఆలయ ప్రవేశం చేయవచ్చునని దేవస్థానంవారు వందల సంవత్సరాలుగా నియమాన్ని పాటిస్తున్నారు. కారణం ఆ సమయంలో స్ర్తిలు అశౌచకం కలవారు అయినా బయటపడకుండా ఆలయంలో ప్రవేశించి పవిత్రతకు భంగం కలిగిస్తారనే అపనమ్మకం వలన నిషేధించడం జరిగింది.వాస్తవానికి స్ర్తిలు అటువంటి సమయాలలో ఏ దేవాలయానికి వెళ్ళకూడదు. ఇంట్లో పూజలు చేయకూడదు. పేరంటాలకు, శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఇందుకు శాస్ర్తి య కారణాలు గూడా కలవు. పూర్వం వారికి ప్రత్యేక గది కేటాయించే వారు. ఈ రోజుల్లో అన్ని నియమాలు మంట గలిసాయి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
సామాన్యుల వెతలు
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్న సూక్తి ప్రస్తుతం ఏ ప్రభుత్వం గద్దెనెక్కినా ప్రజలకు ఏమి ఒరుగును? అన్న విధంగా అన్వయించుకోవాల్సి వస్తోం ది. యుపిఏ జమానాలో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయి పేద, మధ్యతరగతి వారి బ్రతుకులు ఛిద్రమై పోయాయి. నిత్యావసర సరుకులు అంతరిక్షయానం చేస్తున్నాయి. ముఖ్యంగా చిరు ఉద్యోగులు, పెన్షనర్ల బ్రతు కు వర్ణింపశక్యం కాదు. సరుకులు, విద్య, వైద్యం, రవాణా, సేవలు ఇలా అన్నీ ఖరీదైనాయి. వారికి పట్టపగలే చుక్కల్ని చూపిస్తున్నాయి. పెరిగే ధరలు, పెరగని జీతాల వలన అవినీతి పెరగడం, కుటుంబంలో కలహాలు, దొంగతనాలు పెరగడం వంటి సామాజిక సమస్యలెన్నో ఉత్పన్నం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సామాన్యులకు స్వాంతన కలిగేలి చర్యలు చేపట్టాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
శే్వతవర్ణం వారిని ఆదుకోవాలి
తెలంగాణ రాట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగంగా తెల్లటి శరీరం కలిగిన వారిని ఆదుకొనేందుకు ఒక మంచి సంక్షేమ పథకం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. తెల్లటి శరీరం కలిగినవారు ఎండకు వెళ్ళి ఏ పని చేయలేరు. వారు పుట్టుకతో దృష్టి లోపంతో జన్మిస్తారు. శరీరం సున్నితంగా ఉంటుంది. వారు కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవించవలసి వస్తుంది. వారి జీవన అభివృద్ధికి, సామాజిక న్యాయంలో భాగంగా వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి గాను వారికి విద్య, వైద్యం, ఉపాధి సంక్షేమ పథకాలల్లో ప్రాధాన్యం కల్పించడానికి గాను వారి జనాభా ప్రకారం ఒక ప్యాకేజిని బడ్జెట్‌లో ప్రవేశపెట్టి వారి జీవన విధానానికి కృషిచేయవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనవి.
- ఈదునూరి వెంకటేశ్వర్లు, నెక్కొండ