ఉత్తరాయణం

ప్రజల్ని సోమరిపోతులుగా మార్చొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం అధికారికంగా పండుగలూ, ఉత్సవాలూ నిర్వహించడం, విందులూ, దుస్తులు పంచిపెట్టడం, కులం మతం ప్రాంతం పేరుతో నజరానాలు, భవన నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నది. ఇవేమీ ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు కానేకావు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల విశ్వాసం కలిగి మరోసారి అధికారం కట్టబెట్టే అవకాశం ఉంటుంది. అధినేతతో మాట్లాడేందుకు మంత్రులకే అపాయంట్‌మెంట్ లభించడంలేదు. గోడు వెళ్లబోసుకుందామంటే ప్రజలకు దర్శన భాగ్యమే కలగడం లేదు. సచివాలయానికి వచ్చి సంతకాలు చేసే తీరికలేక ఫైళ్ల దొంతర పెరిగిపోతోందట. కానీ..వరుసగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల అధినాయకుడు మహాశ్రద్ధ కనపరచడం విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో గాని తెలంగాణ సమా జానికి ఈ విధానం శ్రేయస్కరం కాదు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, అర్హులకు స్వయం ఉపా ధి కల్పించాలి. మూతపడిన పరిశ్రమలు తెరిపించాలి. ఉత్పత్తి రంగం, వ్యవసాయ రంగాలకు చేయూతనివ్వాలి. అందరికి ఉచితంగా విద్య, వైద్యం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలి. చేతులు చాచే సోమరిపోతు లుగా ప్రజల్ని తయారుచేసి ఎన్నికల వేళ వరాల ఆశలు చూపి అధికారం కైవసం చేసుకోవాలనుకోవడం తప్పు. మేధావులు నోళ్లు తెరచి ప్రజల పక్షం వహించాలి.
- పి. సంధ్య, సిద్దిపేట
దేశ ప్రతిష్ఠకు ముప్పు
మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షీద్‌లు చేసిన వ్యాఖ్యలు జాతి వ్యతిరేకం. భారత దేశ గౌరవాన్ని నిట్ట నిలువునా భూస్థాపితం చేసిన వ్యక్తులు వీరు. మన శత్రు దేశమైన పాకిస్తాన్‌కు ఇచ్చిన గౌరవం మాతృదేశానికి ఇవ్వలేదు. వీరిద్దరూ దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించిన మాట వాస్తవం. అందుకే అది వారి వ్యక్తిగత వ్యాఖ్యలుగా సరిబుచ్చుకోవడం కాంగ్రెస్‌కు తగదు. అది వారికే నష్టం. ఏ పార్టీ వారైనా సరే దేశ ప్రతిష్టకు భంగం కలిగించేవారిని వదలిపెట్టరాదు. భారత ప్రధానిని తక్కువ చేసి మాట్లా డడమే కాక, పాకిస్తాన్ వైపుకు మొగ్గి మాట్లాడి పెద్ద తప్పు చేశారు. సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవా దాన్ని పరోక్షంగా సమర్థించినట్లయంది. సల్మాన్ చేసిన వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమే కాక, దేశ ద్రోహ నేరం కిందికి వస్తాయ. పాకిస్తాన్ దేశాన్ని నాలుగేళ్లు ఓర్పు వహిం చమని కోరినాడంటే భారత్‌పై ఎంత వ్యతిరేకత వీరికి ఉన్నదో అర్థమవుతుంది. దేశ ప్రజలెన్నుకున్న ప్రభు త్వాన్ని నిర్లక్ష్యం చేసి మాట్లాడటం తప్పు. శత్రు దేశాలను పరోక్షంగా దేశంపైకి ఆహ్వానించినట్లు కాదా? కావున వీరిద్దరికీ దేశ బహిష్కరణ శిక్ష విధించాలి. అదే దేశానికి శ్రీరామ రక్ష.
- జి. శ్రీనివాసులు, అనంతపురం
పాముకు పాలుపోసి పెంచితే...
భిన్న సంస్కృతులకు ఆలయమైన ఫ్రాన్స్ నగరంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 128 మంది అమాయకులు మృత్యువాత పడటం దిగ్భ్రాంతికరం. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ఫ్రాన్స్‌లో ఇది అతిపెద్ద ఘాతుకమని విశే్లషకుల అభిప్రాయం. ప్రపంచమంతా ఉగ్రవాదంపై అలుపెరుగని పోరు ప్రకటించి, ఫ్రాన్స్ దేశానికి ఒకవైపు బాసటగా నిలుస్తుంటే, మరొకవైపు ఫ్రాన్స్, అమెరికా సైనిక దళాలు సిరియాలోని అమాయక ప్రజలపై వైమానిక దాడులకు తెగబడటం క్షమార్హం కాదు. గతంలో ఉగ్రవాదంపై పోరు ముసుగులో అమెరికా ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ దేశాలలో సాగించిన మారణకాండను ఇప్పటికీ ప్రపంచం మరచిపోలేకపోతోంది. ఇప్పుడు ఐసిస్‌పై పోరు పేరుతో మళ్లీ ఫ్రాన్స్, అమెరికా దేశాలు సిరియాపై తెగబడటం ప్రారంభించాయ. సమస్య మూలంలోకి వెళితే ఇరాక్‌పై ఆక్రమణ సందర్భంలో ఐసిస్ సంస్థ, ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి సందర్భంగా తాలిబన్లు పుట్టుకొచ్చారు. నిన్నటివరకు సిరియా ప్రభుత్వంపై ఉగ్రవాదులను ఉసిగొల్పి, వారికి రకరకాల ఆయుధాలను సరఫరా చేస్తూ దేశంలో అంతర్యుద్ధం సృష్టించిన ఫ్రాన్స్, అమెరికా దేశాలకు ఉగ్రవాదంపై మాట్లాడే హక్కు ఎక్కడుంది? ఈ దేశాలు పెంచి పోషించిన ఉగ్రవాద విషసర్పం ఇప్పుడు ప్రపంచం నలుమూలలా వేగంగా విస్తరిస్తోంది. తన ప్రయోజనాల కోసం అనేక ఆసియా, ఆఫ్రికా దేశాల అంతర్గత వ్యవహారాల్లో పశ్చిమ దేశాలు తలదూర్చి అక్కడ పాలకులకు వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నాయ. తాము పాలు పోసి పెంచిన పాము తమనే తిరిగి కాటు వేయడంలో ఆశ్చర్యం ఏముంది?
- సి. సాయమనస్విత, విజయవాడ
వేదన కమిటీ..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలపై 7వ వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిం చినట్లు ప్రముఖ పత్రికల్లో ప్రకటించారు. గత పేకమీషన్ ప్రకారం ప్రభుత్వం 40 శాతం జీతం కేంద్ర ఉద్యోగులకు 2006 జనవరి 1 నుంచి ఇచ్చింది. కానీ ప్రస్తుతం 7వ వేతన సంఘం 15 శాతం మాత్రమే సిఫారసు చేసినట్టు తెలుపుతోంది. ఇది చాలా అన్యాయం. రోజు రోజుకు ధర లు పెరిగిపోతున్నాయ. వేతన జీవులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఉద్యోగులకు పిడుగులాంటి వార్త. ఎంతో నిరుత్సాహాన్ని కలిగించింది. ఒన్ ర్యాంక్ వన్ పెన్షన్ యవ్వమని సిఫారసు చేశారు. ఇది ఎవరు అడి గారు? సైన్యం వారికే ఇది పూర్తిగా ఇవ్వలేదు. దీనివల్ల సివిల్ ఉద్యోగులకు ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకు ఒకసారి పే కమిటీని వేసి జీతాలు పెంచుతున్నారు. వాళ్లకు 44 శాతం జీతం పెంచారు. దీని ప్రకారం కేంద్ర ఉద్యోగులకు 88 శాతం పెంచాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పదేళ్లకోమారు పే కమిటీని వేస్తుంది. అందువల్ల ప్రభుత్వం పరిశీలించి తగిన మార్పులు చేయాలి.
- కె.వి. రావు, హైదరాబాద్