సంజీవని

కామెర్లతో కాలేయానికి అపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం మరణించేంతవరకు పునరుత్పత్తి చెందగల ఏకైక అవయవం కాలేయం. అంతేకాదు, శరీరంలోని అతి పెద్ద అవయవం! 500పైగా శరీర ధర్మాల్ని నిర్వర్తించే అవయవం! చరిత్రలో కూడా కొన్ని సందర్భాలలో కాలేయ ప్రత్యేకతని చెప్పారు. ఇది ఒక పెద్ద రసాయన కేంద్రం. శరీరంలో పలు ధర్మాల్ని నిర్వర్తించడానికి తోడ్పడే అనేక రసాయనాల్ని ఇదే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది దెబ్బతింటే కాలేయానికి సంబంధించినవే కాకుండా, మరెన్నో అపాయాలు కలగవచ్చు. అందుకని కాలేయ ఆరోగ్యాన్ని కనిపెట్టుకొని ఉండటం అవసరం.
హెపటైటిస్ బి, సి లాంటివాటివల్ల కాలేయం దెబ్బతినవచ్చు. తల్లి నుంచి ఈ హెపటైటిస్, గర్భంలో ఉన్న పిల్లలకి రావచ్చు. కాబట్టి తల్లి గర్భంతో వున్నపుడు, తల్లి పిల్లలకి హెపటైటిస్ పరీక్షలు చేయించడం అవసరం. మందులు వాడడం అవసరం. అయితే వాక్సినేషన్‌ని ఇస్తారు. ఈ వైరస్ కారణాన అవయవాలు సరిగ్గా పెరగకపోవచ్చు. జాండిస్ (పచ్చకామెర్లు) రావచ్చు.
జాండిస్ అనేది వ్యాధి కాదు, ఒక లక్షణం. దాని ద్వారా కాలేయం దెబ్బతిన్నదని తెలుసుకోవచ్చు. మూఢ నమ్మకాలు, నాటు వైద్యాలతో సరైన వైద్యం జోలికి పోకుండా ఉంటే ప్రాణాపాయం కూడా కలగవచ్చు. చెట్ల మందులు లాంటివి జాండిస్ తగ్గడానికి వేస్తుంటారు. జాండిస్ అంటే కాలేయం దెబ్బతిన్నది అనుకునే లక్షణం అనుకున్నాం కదా? కాలేయం దెబ్బతినడానికి కారణాలు ఎన్నో! హెపటైటిస్‌వల్ల కాలేయం దెబ్బతినవచ్చు. ఫాటీ లివర్‌వల్ల కాలేయం దెబ్బతినవచ్చు. బైల్‌డక్ట్‌లో అడ్డంకులవల్ల కాలేయం దెబ్బతినవచ్చు. జాండిస్ రావచ్చు. ఇన్ని రకాల అనారోగ్యాలకీ ఒకే రకమైన చెట్ల మందు, సర్వరోగ నివారిణిగా ఉపయోగపడదు కదా! బైల్ డక్ట్‌లో అడ్డంకులు ఉంటే తప్పనిసరిగా శస్త్ర చికిత్స అవసరం. కాబట్టి ఏ కారణాన కాలేయం దెబ్బతింటుందో ఆ కారణాన్ని నివారించకపోతే, కాలేయ అనారోగ్యం తగ్గదు, జాండిస్ తగ్గదు.
హెపటాలజిస్ట్.. అంటే కాలేయ చికిత్సకి సంబంధించిన ప్రత్యేక వైద్యుణ్ణి సంప్రదించి సకాలంలో సరైన చికిత్స చేయించుకోవడం అవసరం.
అపరిశుభ్ర ఆహారం, నీళ్ళు తీసుకోవడంవల్ల, చిన్నపిల్లలు, పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు, కాలేయం దెబ్బతిని జాండిస్ వస్తూంటుంది. వాక్సినేషన్స్ సకాలంలో తీసుకోవడం అవసరం. జాండిస్‌ని అలా వదిలేస్తే కాలేయం దెబ్బతినడమే కాదు, మూత్రపిండాలూ దెబ్బతినవచ్చు. అందుకని పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం చాలా అవసరం. వీలైతే కాచి చల్లార్చిన నీళ్ళు తాగడానికి ఉపయోగించాలి. ఆహార పదార్థాలు వేడిగా ఉన్నపుడే తినాలి. ఎందుకంటే, వేడిలో వైరస్‌లు బ్రతకవు. మీరు ఒక విషయాన్ని గమనించి ఉంటారు. వైరల్ జ్వరాలు వచ్చినపుడు శరీర ఉష్ణం చాలా ఎక్కువగా పెరుగుతుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తి ప్రభావం అది. అలా శరీరంలో వేడి పెరిగితే వైరస్ చనిపోయి, ఆరోగ్యం కుదుటపడుతుంది.
పిల్లలు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆహారం తీసుకోవాలి. అలాగే రోడ్లమీద దొరికే పానీయాల్ని, ఆహారాల్ని తీసుకోకూడదు. ముఖ్యంగా స్కూళ్ళ దగ్గర ఇలాంటివి అమ్మకుండా చూసుకోవాలి. చుట్టూ వున్న వాతావరణం ఎంత పరిశుభ్రంగా ఉంటే ఇలాంటి వ్యాధులకి అంత దూరంగా ఉంటాం. చాలామంది ఖర్చుపెట్టే కాలరీలకన్నా ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అంతేకాక కొందరిలో కదలికలు తక్కువగా ఉంటాయి. దాంతో మిగిలిన ఆహార పదార్థాలు కొవ్వు రూపంలో చర్మం కింద పేరుకుపోతుంటాయి. ఇలా శరీరం బరువు పెరిగిపోతూంటాయి. బరువు పెరిగిపోవడంవల్ల అనర్థాలు ఎన్నో. వాటిలో ముఖ్యమైంది ఫాటీ లివర్. హై ఒమెగా 6 ఫాటీ ఆసిడ్స్ అంటే వెన్న, నెయ్యి, జున్ను, తీపి పదార్థాలు, షుగర్స్, చాక్లెట్స్ లాంటి ప్రక్టోస్‌వల్ల ఫాటీ లివర్ వస్తుంది. దాంతో లివర్ పూర్తిగా దెబ్బతిని సిరోసిస్ కూడా రావచ్చు. కాలేయ ఫెయిల్యూర్‌కి ఇదే ప్రధాన కారణం. కాబట్టి ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. సరైన ఆహారాన్ని నిర్ణీత వ్యవధిలో తీసుకోవాలి. శరీర వ్యాయామం కూడా తగినట్టు ఉండాలి.
ఐదు సంవత్సరాలు అంతకుపైగా ఆల్కహాల్ తాగేవాళ్ళలో కాలేయం మరియు గుండె కూడా దెబ్బతినవచ్చు. కొంతమంది రోజూ కొద్ది కొద్దిగా మందులా తీసుకుంటున్నాం అనుకుంటారు ఆల్కహాల్‌ని. కాని క్రమంగా అది అలవాటుగా మారి, ప్రాణాంతకం అవుతుంది. ఒకసారి ఆరోగ్యం దెబ్బతిందంటే తర్వాత ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒత్తిడి, ధూమపానం, అధిక బరువు- మూడింటికి ఒకదానితో దానికి సంబంధం ఉంది. వాటివల్ల చాలా అనారోగ్యాలు వస్తాయి. వాటిలో ముఖ్యమైంది కాలేయం దెబ్బతినడం! అందుకని సరైన ఆహారం, వ్యాయామంతోపాటు మనస్సుని ఆహ్లాదంగా ఉంచేందుకు సంగీతం, సాహిత్యం లాంటి వాటిపట్ల ఆసక్తి పెంచుకోవడం అవసరం.
ఎక్కువ కొవ్వుతో కూడిన ఆహారాన్ని తీసుకోవడంవల్ల ఆహార నాళం లోపలి భాగం దెబ్బతినవచ్చు. కీడుని కలిగించే బ్యాక్టీరియా పెరగవచ్చు. తద్వారా కాలేయం దెబ్బతినవచ్చు. అధిక బరువు వున్నవాళ్ళలో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా కనిపిస్తూంటుంది. మంచి బ్యాక్టీరియా తగ్గిపోతూంటుంది. కాబట్టి చిన్నప్పట్నుంచి సరైన ఆహారపు అలవాట్లతో ఆహార నాళాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం.
వాక్సినేషన్‌తో హెపటైటిస్ బి, సిలు రాకుండా కాపాడుకోవచ్చు. శస్త్ర చికిత్స జరపకుండానే ఈ ఆర్‌సిపి లాంటి పరికరాలతో కాలేయ ఫంక్షన్ పరీక్షలతో కాలేయ అనారోగ్యాన్ని సకాలంలో తెలుసుకొని సరైన చికిత్స పొందడం చాలా అవరం.
ఇప్పుడు కాలేయం పూర్తిగా చెడిపోయినా దానిని మార్చి పునర్జన్మని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలేయ మార్పిడి రెండు రకాలుగా ఉంటాయి. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ నుంచి కాలేయాన్ని దానంగా స్వీకరించి, కాలేయ మార్పిడి శస్తచ్రికిత్స జరిపితే ‘కెడావరిక్ లివర్ డోనార్ డొనేషన్’ అంటారు. కాలేయం పునరుత్పత్తి చెందే అవయవం కాబట్టి రక్తసంబంధీకుల నుంచి కాలేయం కొంత భాగాన్ని దానంగా స్వీకరించి, దెబ్బతిన్నవాళ్ళకి అమరిస్తే ‘లివింగ్ డోనార్ డొనేషన్’ అంటారు. ఇది రక్త సంబంధీకుల మధ్యే జరగాలి. ఇద్దరికీ రెండు మూడు నెలల్లో కాలేయం పూర్తి స్థాయికి పెరుగుతుంది.
ఇలాంటి ఆధునిక చికిత్సా పద్ధతులన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి.
**