అక్షర

‘మధురాంతకం’ మధురమైన బాలల కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలల కథలు
సంకలనకర్త: మధురాంతకం నరేంద్ర
ధర: రూ.60/-
ప్రతులకు నవచేతన పబ్లిషింగ్ హౌస్,
హైదరాబాద్,
నవచేతన బుక్ హౌస్, అన్ని బ్రాంచీలు,
ప్రజాశక్తి బుక్‌హౌస్

ఏ విషయాన్నైనా చక్కగా చెప్పగలిగిన గొప్ప రచయిత మధురాంతకం రాజారాంగారు. అతని నవలలు, కథలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. ‘బాలల కథలు’ బాలసాహిత్యంలో అతనికున్న ప్రతిభను చాటుతున్నాయి. నవచేతన పబ్లిషింగ్‌వారు ప్రచురించిన ఈ పుస్తకంలో తొమ్మిది కథలున్నాయి. ‘వనభోజనం’ ఒక కథ. అదొక కాలం! వెర్రికాలం అంటు మొదలవుతుంది. శీతాకాలం, ఎండాకాలం. ఈ యుగం ఆ యుగమని విన్నాం కానీ వెర్రి కాలమేమిటని ఆశ్చర్యపోతాం. అది ఆ కాలమే ‘్ధనుర్మాసం’అని, తన కోడళ్లు ఆ కాలంలో ఎప్పుడూ లేనంతగా ఎలా పూజలూ వ్రతాలూ అంటూ వొక్క పొద్దులంటూ ఇంట్లో చప్పిడి భోజనాలు తయారుచేస్తారు. జబ్బుపడి భార్య మరణా నంతరం సరైన భోజనానికి మొహం వాచిన మామ పొలంలో పాలేరు తెచ్చిన కోడికూర తింటాడు. ఆ కోడిని పాలేరు తన కోడళ్ల ఇంటినుంచే పట్టుకొచ్చాడని తెలిసి కోడళ్లు గొప్పగా కోడి గురించి మాట్లాడుతూ వుంటే, ఏమీబాగాలేదు ఆ కోడి అని అనేసరికి, గొప్పలు చెప్తూన్న కోడళ్లు మరి మాట్లాడరు! అలాగే ‘విషకన్య’ అనే బెంగాలీ వాతావరణంలో వందేళ్లక్రితం జరిగిన చెప్పుకునే ఒక కథ. అలాగే సమయస్ఫూర్తి లోకపుతీరు, టీకప్పులో తుఫాను, చిరకాల నిద్రితుడు, ఇద్దరు యాత్రీకులు, ఓటమి, గోటదీరు పనికి గొడ్డలేలా, ఇలా తొమ్మిది కథలున్నాయి ఈ సంపుటిలో.

-శారదా అశోకవర్ధన్