జాతీయ వార్తలు

చారిత్రక ఒప్పందంపై మహారాష్ట్ర, తెలంగాణ సీఎంల సంతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: తెలంగాణ, మహారాష్ట్రల మధ్య గోదావరి నదిపై నిర్మించే బ్యారేజీలకు సంబంధించి మంగళవారం కీలక ఒప్పందం కుదిరింది. ముంబయిలోని సహ్యాద్రి అతిథిగృహంలో మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్‌, కేసీఆర్‌ల సమక్షంలో ఉన్నతాధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం తర్వాత తెలంగాణ ప్రభుత్వం మూడు బ్యారేజీలు, మహారాష్ట్ర రెండు బ్యారేజీల నిర్మాణం చేపట్టనున్నాయి. కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద, ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజీలు తెలంగాణకు సంబంధించినవి కాగా, మిగిలిన మూడు సంయుక్త ప్రాజెక్టులు.