మెయిన్ ఫీచర్

వధూవరులుగా లక్ష్మీనరసింహులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్షాత్ చతుర్ముఖుడు, సృష్టికర్తయైన బ్రహ్మదేవుడే స్వయాన నిర్వహిస్తున్న స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు ముక్కోటి దేవతలు భూలోకానికి తరలివచ్చారు. లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవం లోకకల్యాణం . ఈ కల్యాణోత్సవంవల్ల ప్రజలకు సుఖశాంతులు చేకూరుతాయి. యాదరుషి కోరికతో యాదాద్రిలో కొలువైన స్తంభోద్భవుడైన లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు మొట్టమొదట బ్రహ్మ దేవుడు నిర్వహించినందున ఏటా నిర్వహించే ఉత్సవాలను బ్రహ్మోత్సవాలుగా పిలుస్తున్నారు. యాదాద్రి క్షేత్రంలో స్వామివారికి నిత్యకల్యాణోత్సవాలు, నిత్యపూజలు, కైంకర్యాలు యథావిథిగా జరుగుతాయ. బ్రహ్మోత్సవాల్లో ధార్మిక సాహిత్య, సంగీత, మహాసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. 1890-1900మధ్య కాలం నుండి గుట్టపై ధార్మిక సాహిత్య, సంగీత మహాసభలు సాగుతుండటం విశేషం.